– నిలోఫర్ ప్రాంగణంలో హాస్టల్ నిర్మాణానికి స్థల పరిశీలన
– మంత్రి ఆదేశాలతో హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: నిలోఫర్ హాస్పిటల్ ప్రాంగణంలోనే హాస్టల్ ఉండడం వల్ల డాక్టర్లతోపాటు, రోగులకు కూడా మేలు కలుగుతుందని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ అన్నారు. దీనివల్ల వందలాదిమంది డాక్టర్లు 24 గంటలపాటు హాస్పిటల్‌లో అందుబాటులో ఉంటారని, తద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందుతాయని తెలిపారు. నిలోఫర్ హాస్పిటల్ ప్రాంగణంలో 280 మంది డాక్టర్లు(పీజీ స్టూడెంట్స్, సీనియర్ రెసిడెంట్స్) ఉండేందుకు అనువుగా హాస్టల్ భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు క్రిస్టినా అధ్యక్షతన నిలోఫర్ హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు హాస్టల్ భవన నిర్మాణం కోసం నిలోఫర్ హాస్పిటల్ ప్రాంగణంలో స్థల పరిశీలన చేశారు. 180 మంది ఫిమేల్, వందమంది మేల్ డాక్టర్లకు సరిపడ భవనాలు నిర్మించేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసింది. ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించనున్నట్టు క్రిస్టినా ఓ ప్రకటనలో తెలిపారు. హాస్పిటల్ ప్రాంగణంలోనే హాస్టల్ ఉండడం వల్ల డాక్టర్లతోపాటు, పేషెంట్లకు కూడా మేలు కలుగుతుందన్నారు. వందలాదిమంది డాక్టర్లు 24 గంటలపాటు హాస్పిటల్‌లోనే అందుబాటులో ఉంటారని, తద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందుతాయని ఆమె తెలిపారు. హాస్పిటల్ భవనంపైన నిర్మించిన ఐరన్ స్ట్రక్చర్‌ను త్వరలోనే వైద్య సేవల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడిరచారు. పెండిరగ్ పనులు పూర్తి చేయాలని, అవసరమైన మరమ్మతులు చేయించాలని టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డికి క్రిస్టినా సూచించారు. హాస్పిటల్ ప్రాంగణంలో నిర్మించిన ధర్మశాల భవనాన్ని నిలోఫర్ ఆరోగ్య శాఖకు అప్పగించాలని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌ను క్రిస్టినా ఆదేశించారు. 72 గదులు ఈ భవనంలో అందుబాటులో ఉన్నాయని, రోగుల సహాయకుల కోసం ఈ భవనాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. హాస్పిటల్ బ్రాండిరగ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను ఆమె ఆదేశించారు. హాస్పిటల్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ, రద్దీని తగ్గించే అంశంపైన, సీఎస్‌ఆర్ ఫండ్స్‌తో గతంలో జరిపిన కొనుగోళ్లపైన చర్చించారు. ఈ కొనుగోళ్లలో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంపై సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై కొనుగోళ్లన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరపాలని ఆదేశించారు. అవసరమైన యంత్రాలు, పరికరాల కోసం హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిపాదనలు రూపొందించాలని, ఆ ప్రతిపాదనలను డీఎంఈ పరిశీలించి టీజీఎంఎస్‌ఐడీసీకి పంపించాలని సెక్రటరీ ఆదేశించారు. నిబంధనల ప్రకారం గ్లోబల్ టెండర్ల ద్వారా టీజీఎంఎస్‌ఐడీసీ కొనుగోళ్లు చేపట్టాలని ఆ సంస్థ ఎండీ ఫణీంద్ర రెడ్డికి సూచించారు. సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





