– ఒడిశా ప్రభుత్వ తీరుపై సోషల్ విూడియాలో వైరల్
భువనేశ్వర్, డిసెంబర్ 22: రన్‌వేపై పరీక్ష.. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండి. ఒడిశా ప్రభుత్వమే ఇలా పరీక్ష నిర్వహించింది. ఎనిమిదివేల మందికి వివిధచోట్ల సెంటర్లు కేటాయించడంకంటే ఒకేచోట పరీక్ష నిర్వహించడం తేలిక అనుకుందో ఏమో అందుకనువైన స్థలం ఎయిర్‌పోర్టు రన్‌వేను ఎంపిక చేసింది. ఈ సంఘటన సోషల్ విూడియాలో వైరల్‌గా మారింది. సబల్‌పూర్ జిల్లాలోని 24 పోలీస్ స్టేషన్‌లలో 187 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కనీస అర్హత 5వ తరగతి ఉత్తీర్ణత. జిల్లావ్యాప్తంగా 8,000మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎంబీఏ, ఎంసీఏ, గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, డిప్లొమా, ఐఐటి శిక్షణ పొందిన అభ్యర్థులతోపాటు కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పొందిన వారు ఉన్నారు. పరీక్ష రాసేందుకు ఒడిశా ప్రభుత్వం సంబల్‌పూర్ జిల్లాలోని జమర్‌పాలి రన్‌వేను కేటాయించింది. డెస్క్‌లు, మ్యాట్‌లు వంటి కనీస సౌకర్యాలు లేకుండా 8,000మందికి పైగా రన్‌వేపై కూర్చుని పరీక్ష రాశారు. పరీక్ష పర్యవేక్షణకు డ్రోన్‌లను వినియోగించారు. అభ్యర్థులను ఉదయం 6 గంటలకు రిపోర్టు చేయాలని ఆదేశించిన అధికారులు 9 గంటలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. 10.30కు ప్రశ్నాపత్రాలు పంపిణీ చేశారు. ముగ్గురు అదనపు సూపరింటెండెంట్లు, 24మంది ఇన్‌స్పెక్టర్లు, 86మంది ఎస్‌ఐలు, ఏఎస్సైలతోపాటు వందమందికి పైగా హోంగార్డులు, ట్రాఫిక్ సిబ్బందిని పరీక్ష పర్యవేక్షణకు నియమించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగ సమస్యకు ఈ పరీక్ష నిదర్శనమని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉపాధి కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





