– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మా రెడ్డి మృతికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, శాసన సభ్యుడిగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఆయన వివిధ రంగాల్లో సేవలందించారని, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మరణం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డి జీవితాంతం కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం అంకితభావంతో పనిచేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి గారి వారసత్వాన్ని కొనసాగించిన నాయకుడని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి సీతక్క ప్రార్థించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





