హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రజలకు రష్ట్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పండుగగా హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే పండుగ హోలీ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సహజ సిద్ధమైన రంగులు, సాంప్రదాయ పద్ధతులతో పండుగను జరుపుకోవాలన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజల సమైక్యతను చాటే పండుగ హోలీని వేడుకగా జరుపుకోవాలని అన్నారు. అలాగ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ ప్రజల్లో రంగులు నింపాలని కోరుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.