ఉస్మానియా వర్సిటీలో హోలీ సంద‌డి

– యువతతో కలిసి పాల్గొన్న బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో యువతతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మంగళవారం హోలీని ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సానుకూల చైతన్యాన్ని, సామూహిక భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక నివాసులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి రామచందర్ రావు తన నివాసంలో హోలీ పండుగను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. రంగులు, సాంప్రదాయ ఆటలు, సమైక్యతను ప్రతిబింబించే ఉత్సవం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *