మంథనిలో కాంగ్రెస్  జెండా ఎగరవేస్తాం

– మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు

మంథ‌ని, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 9 : మంథ‌ని మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేస్తామ‌ని ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. చివరి రోజు ఎలక్షన్ ప్రచారంలో భాగంలో సోమ‌వారం మంథ‌నిలోని శ్రీపాదరావు విగ్రహం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్ షో జరిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీధ‌ర్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరుపేద కుటుంబాలకు అందజేస్తూ ముందుకు వెళ్తున్నదని, ఎక్కడా అవినీతి జరగకుండా నేరుగా పేదలకు చేరవేస్తున్నామని, రానున్న రోజులలో మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకొచ్చామ‌ని వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 13 మంది అభ్యర్థులను గెలిపించడం ద్వారా అధిక నిధులు కేటాయించి మంథని అభివృద్ధి జరుగుతుందని, పనిచేసే వారికే ఓటు వేయాలని అన్నారు. ప్రతిపక్షాలకు ఓటు వేయడం వృధా అని తెలిపారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, డ్వాక్రా సంఘాల ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వివ‌రించారు. కుట్టుమిషన్ల ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తామన్నారు. ఇప్పటికే మంథని మున్సిపల్ కార్యాలయం సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి, దరఖాస్తుదారులు ఎవరైనా వచ్చిన వెంటనే దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి వారికి త్వరితగతిన విచారణ చేసి పనులు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతి ఒక్కరికి వైద్యం అందాలనే ఉద్దేశంతో మంథనిలో ఐదు పడకల డయాసిస్ సెంటర్ ను ఏర్పాటు చేశామ‌ని, ఎంపీడీవో ఆఫీస్ దగ్గర్లో నూతన 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *