హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

– అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– జలమండలి ఎండీ హెచ్చరిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాన్‌ ప్రభావంతో నగరం ముసురేసింది. హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి ఆదేశించారు. వర్షం వల్ల నగర పజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తరచూ సీవరేజీ ఓవర్‌ ప్లో అయ్యే మ్యాన్‌హోల్స్‌ గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్‌ దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. డీప్‌ మ్యాన్‌హోల్స్‌ దగ్గర సీవరేజి సూపర్‌వైజర్లు ఉండి పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్స్‌ మూతలను తెరవకూడదని అశోక్‌ రెడ్డి సూచించారు. ఎమర్జెన్సీ కోసం జలమండలి హెల్ప్‌ లైన్‌ 155313కుి కాల్‌ చేయాలని కోరారు. జంట జలాశయాల గేట్లు ఎత్తిన నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, మొంథా తుఫాన్‌ ప్రభావం కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్‌హోల్స్‌ పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కిలోవిూటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, గాంధీనగర్‌, కవాడిగూడ, భోలక్‌పూర్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, బర్కత్‌పురా, బీఎన్‌రెడ్డినగర్‌, విూర్‌పేట్‌, బాలాపూర్‌, బడంగ్‌పేట్‌, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీషరీఫ్‌, జవహర్‌నగర్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, దోమలగూడలో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *