రియల్‌ ‌వ్యాపారులకు అనుకూలంగా ‘హిల్ట్’

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 3 : ‌క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం ‘హైదరాబాద్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌ల్యాండ్స్ ‌ట్రాన్స్‌ఫర్మేషన్‌’ ‌హిల్ట్ ‌పాలసీని తీసుకొచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులకు అనుకూలంగా హిల్ట్ ‌పాలసీ ఉందని ఆరోపించారు. దిల్లీలో డియాతో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవాడలో పనిచేస్తున్న వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సహకారం అందించకుండా పారిశ్రామిక వేత్తలకు లబ్ది చేకూరుస్తోందని విమర్శించారు. పారిశ్రామికవేత్తలకు ఒక విధానం.. రైతులకు ఒక విధానమా? అని  కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలకు లబ్ది చేకూర్చేలా అవినీతి జీ.ఓ.ను తెచ్చారన్నారు. హైదరాబాద్‌ ‌పారిశ్రామిక ప్రాంతాల్లోని వేల ఎకరాల్లో కమర్షియల్‌ ‌కాంప్లెక్స్‌లకు అనుమతిస్తే ట్రాఫిక్‌ ‌పరిస్థితి ఏంటని నిలదీశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *