– ఎంబీబీఎస్ సీట్ల స్థానికతపై హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్,జులై28(ఆర్ఎన్ఎ):ఎంబీబీఎస్ సీట్ల స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తాత్కాలిక తీర్పును ఇచ్చింది. కేఎన్ఆర్‌యూహెచ్ఎస్ కౌన్సెలింగ్ దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. తుది తీర్పు వచ్చే వరకు రిజిస్ట్రేషన్‌లో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో సుమారు 100 మంది అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది. జూలై 30వ తేదీతో రిజిస్ట్రేషన్ ముగియనుండటంతో హైకోర్టు ఈ కీలక తీర్పు నిచ్చింది. శాశ్వత నివాసంతోనూ స్థానికత మంజూరు చేయాలని కోర్టు అభిప్రాయపడింది. గత ఏడాది ఇచ్చిన హైకోర్టు ఆర్డర్స్ ఫాలో కావాలని ఆదేశించింది. కాగా, జూలై 15వ తేదీన విడుదలైన ప్రాస్పెక్టస్, నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.





