హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం

– డిసెంబర్‌ 5‌లోపు కోర్టు ఎదుట హాజరుకు ఆదేశం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట వివాదంలో డిసెంబర్‌ 5‌వ తేదీ లోపు కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆయ‌న‌ను ఆదేశించింది. లేకుంటే నాన్‌ ‌బెయిల్‌బుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. బతుకమ్మకుంట వ్యవహారంలో హైకోర్టుకు ఏవీ రంగనాథ్‌ ‌హాజరు కాక‌పోవ‌డంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంటలోని ప్రైవేట్‌ ‌స్థలంపై హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. ఈ ప్రైవేట్‌ ‌స్థలంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దంటూ ఈ ఏడాది జూన్‌12‌న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ఉల్లంఘించారంటూ ఎడ్ల సుధాకర్‌ ‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ప్రైవేట్‌ ‌స్థలంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆయనకు సూచించింది. అంతేకాక వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ రంగనాథ్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. కానీ కోర్టుకు హైడ్రా కమిషనర్‌ ‌హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుంటే ఇప్పటికే ఇక్కడ సుందరీకరణ పనులు సాగాయి. పూర్వవైభవం తీసుకుని వచ్చారు. ఇటీవల సీఎం రేవంత్‌ ‌తదితరులు కలిసి బతుకమ్మకుంటను ప్రారంభించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *