రాష్ట్రంలో ముదరుతున్న ఎండలు

– సాయంత్రాలు పలుచోట్ల వర్షాలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 31:రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగలంతా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం ఆకాశం మేఘాలు కమ్ముకొని ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.సోమవారం ఎండలు మండిపోయి దాదాపు 30 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ ‌జారీ చేసినట్టు తెలిపింది. జగిత్యాల జిల్లా ఆరుట్లలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, మంచిర్యాల జిల్లా కాసీపేట, నల్లగొండ జిల్లా పెద్దవూర, నిజామాబాద్‌ ‌జిల్లా భీంగల్‌లో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నది. వచ్చే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు ఇలానే ఉంటాయని వివరించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *