మేడారం జాతరలో హైటెక్ నిఘా

– తప్పిపోతే క్షణాల్లో గుర్తించే సాంకేతికత
– తొలిసారి టీజీ క్వెస్ట్ డ్రోన్ వ్యవస్థ
– వృద్ధులు, పిల్లల కోసం జియో ట్యాగ్ టెక్నాలజీ
– శబరిమల తరహాలో అమలు
– 30 చదరపు కిలోమీటర్ల మేర డేగ కన్ను
– అప్రమత్తంగా 13 వేల మంది పోలీసులు

ములుగు, ప్రజాతంత్ర, జనపరి 19: కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈసారి సరికొత్త రూపు సంతరించుకోబోతోంది. “జాతరలో తప్పిపోతామనే భయం ఇక అక్కర లేద?నే భరోసా ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ అత్యున్నత సాంకేతికతను వినియోగిస్తున్నాయి. మంత్రి సీతక్క పర్యవేక్షణలో జాతర ఏర్పాట్లు తుది దశకు చేరుకోగా, సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి జాతర కమాండ్ కంట్రోల్ సెంటర్’ను ప్రారంభించారు. టీజీ క్వెస్ట్ అత్యాధునిక డ్రోన్ వ్యవస్థ మేడారం 2.0’లో భాగంగా మేడారం జాతరలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ఎవరూ తప్పిపోకుండా ప్రజలందరికీ సురక్షిత జాతర అనుభవం కలిగించేలా భద్రతను పర్యవేక్షించేందుకు ‘టీజీ-క్వెస్ట్?’ అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ సాంకేతిక?త? ద్వారా 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీ రోడ్లపై ఈ డ్రోన్లు నిరంతరం నిఘా పెడ?తాయి.

13 వేల మంది పోలీస్ సిబ్బంది

డ్రోన్లతోపాటు హీలియం బెలూన్లకు అమర్చిన పాన్ టల్ట్ జూమ్ కెమెరాలు ఎత్తు నుంచి రద్దీని విశ్లేషిస్తాయి. తొక్కిసలాట జరిగే అవకాశమున్న ప్రాంతాలను ముందే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేస్తాయి. దాదాపు 13 వేల మంది పోలీసు సిబ్బంది ఈ టెక్నాలజీ సర్వైలెన్స్ లో విధులు నిర్వహించనున్నారు. మేడారం జాతరలో చాలా పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు కాబట్టి ఎక్కువ శాతం తప్పిపోయే అవకాశం ఉంటుంది.

జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్

ఈసారి మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేప? థ్యంలో జాతరలో భక్తులు తప్పిపోకుండా చర్యలు చేపడుతున్నారు. గత జాతరలో దాదాపు 30 వేల మంది వరకు తప్పిపోయినట్లు రికార్డులు ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ‘జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ వ్యవస్థను తీసుకొస్తున్నారు. వొడాఫోన్-ఐడియా సహకారంతో ఈ విధానం అందుబాటులో ఉంటుంది. క్యూఆర్ కోడ్ గల జియో ట్యాగ్ ?లతో తప్పిపోకుండా చర్యలు పస్రా, తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ గల జియోట్యాగ్ లను కడతారు. దీంతో వారు ఎవరైనా తప్పిపోయినా ఈ ట్యాగ్ ను స్కాన్ చేయటం ద్వారా వారి పూర్తి వివరాలు తెలుస్తాయి. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో అమలు చేయటానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *