మానేరుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ₹203 కోట్లు మంజూరు

– మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

మంథని, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: మంథని మండలంలోని ఆరెంద మీదుగా దామెరకుంట వరకు మానేరు నదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి, మ‌రోవైపు దామెరకుంట రోడ్డుకు సంబంధించిన అప్రోచ్ రోడ్డు కమ్ రోడ్డు పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి శాఖ ద్వారా రూ.203 కోట్ల నిధులను మంజూరు చేసింది.తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈ నిధుల మంజూరు అయ్యాయి.ఈ ప్రాజెక్టులో భాగంగా 1.120 కిలోమీటర్ల పొడవు,13 మీటర్ల వెడల్పుతో హై లెవల్ బ్రిడ్జితో పాటు 9.530 మీటర్ల వెడల్పుతో అప్రోచ్ రోడ్డు నిర్మించనున్నారు.ఈ బ్రిడ్జి నిర్మాణంతో పెద్దపల్లి జిల్లా మంథని మండల ప్రజలు మాత్రమే కాకుండా పరిసర మండలాల ప్రజలు ఇతర జిల్లాలకు,మహారాష్ట్ర కు,కాలేశ్వరం దేవాలయానికి,జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాంతాలకు సులభంగా ప్రయాణించే అవకాశం కలుగనుంది.ముఖ్యంగా కాలేశ్వరం వెళ్లే దూరం సుమారు 25 కిలోమీటర్ల వరకు తగ్గనుందని అధికారులు వెల్లడించారు.ఈ ప్రాజెక్టు పూర్తయ్యితే కాలేశ్వరం టూరిజం అభివృద్ధి పెరగడమే కాకుండా,ఆరెంద,మల్లారం,వెంకటాపూర్,దామెరకుంట గ్రామాల ప్రజలకు రవాణా,వైద్య,విద్యా రంగాల్లో విశేష ప్రయోజనం చేకూరనుంది.అంతేకాకుండా పెద్దపల్లి జిల్లా–జయశంకర్ భూపాలపల్లి జిల్లా మధ్య కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. మానేరు నదిపై ఆరెంద మీదుగా దామెరకుంట వరకు హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి భారీ నిధులు మంజూరు చేసినందుకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు పెద్దపల్లి జిల్లా ప్రజలు,మంథని మండల ప్రజలు,జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు,సంబంధిత గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *