– ఆర్థిక కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం
– తక్షణం కోర్టు ముందుకు రావాలని ఆదేశం
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి
పెన్షనర్లను వేధిస్తున్న ప్రభుత్వం: బిఆర్‌ఎస్ సభ్యుల వాకౌట్

ప్రభుత్వ ఉద్యోగలు జీతభత్యాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనగా బీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా సభ నుంచి వెళ్లిపోయారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడంలో అలసత్వం వహించడం, పీఆర్సీ డీఏ విషయంలో సీపీఎస్ విషయంలో, ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్న మోసపూరిత వైఖరికి సభ నుండి వాకౌట్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గళమెత్తారు. వారి పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానందా, కల్వకుంట సంజయ్ సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ నెలకు రూ. 700 కోట్ల బకాయిలను చెల్లిస్తామని చెప్పి, ఇంతవరకు చెల్లించలేదని ఆరోపించారు. ఎంతోమంది ఉద్యోగులు వారి మనోవేదనను చెప్పుకోలేక, ఆరోగ్య సమస్యలతో చనిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. రిటైర్డు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారురని, 5 డీఏలు ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్యే సంజయ్ ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




