– ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం
న్యూఢల్లీి, జనవరి 17: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాలకు భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర గ్రూపులు దిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, ముంబై, హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఆయా నగరాల్లోని రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉగ్రమూకలు గగనతలం నుంచి డ్రోన్ల ద్వారా దాడులు జరిపే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దిల్లీలోని ముఖ్య ప్రాంతాల్లో అధికారులు మాక్‌డ్రిల్ నిర్వహిస్తూ నిఘా పెంచారు. ఇప్పటికే సుమారు 50 వేల మందికి పైగా పోలీసులు, 65 కంపెనీల పారా మిలిటరీ దళాలు దిల్లీలో మోహరించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




