హిడ్మాను కాల్చి చంపి కథలల్లుతున్నారు

– కొందరి ద్రోహంతో పోలీసులకు పట్టుపడ్డారు
– ప్రజల్లో హిడ్మా స్థానం సుస్థిరం
– 23న దేశవ్యాప్త నిరసనకు పిలుపు
– కమ్యూనిస్టు పార్టీ (మవోయిస్టు) ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఈ నెల 15న జరిగిన మారేడుమిల్లి బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా 23న దేశవ్యాప్తంగా నిర సన పాటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి అభయ్ పే రిట శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. కామ్రేడ్ హిడ్మా, కామ్రేడ్ రాజీ తో సహా కొంతమందిని పట్టు కొని క్రూరంగా హత్యచేసి ఎన్ కౌంటర్ కట్టు కథలు అల్లారని ఆరోపించింది. ప్రస్తుతం కేం ద్రంలో కామ్రేడ్ హిడ్మా, కామ్రేడ్ రాజీలు కొద్ది మందితో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొంద రు చేసిన ద్రో హం వల్ల స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరడంతో కేంద్ర హోం మంత్రి త్వశాఖ మార్గద ర్శనంలో ఆంధ్రప్రదేశ్ ఎస్ ఐబీ నవంబర్ 15న వీరిని అదుపులోకి తీసుకొని లొంగదీసు కోవడానికి ప్రయత్నించి విఫలం కావడంతో దారుణంగా హత్య చేశారని ఆరోపించింది. మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందని, పెద్ద ఎత్తున ఆయుధాలు లభ్యమయ్యాయని చేసిన ప్రకటన బూటకమంటూ కొట్టిపారేసింది. ఉద్యమ స్ఫూర్తిని, సైద్ధాంతిక పటిమను చూపిన హిడ్మాకు పార్టీ శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నదని పేర్కొంది. చివరివరకు ఉద్యమంలో కొనసాగి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు. మయా జోంట్, హర్యా, ఆమ్రే
శత్రువులకు తలవంచకుండా ప్రాణాలర్పించిన ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్, రాజే (రీజినల్ కమిటీ సభ్యురాలు), చైతు (పీపీసీఎం), కమూ (పీపీసీఎం), కమల్లాల్ (పీఎం) లకు మావోయిస్టు పార్టీ వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నదని పేర్కొంది. వీరు రగిలించిన ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసు కెళతామని స్పష్టం చేసింది. ఉద్యమంలో వుంటూ ఉద్యమావసరాల కోసం ఎన్నో నేర్చుకున్నాడని వివరించింది. మార్క్సిజాన్ని బాగా అధ్యయనం చేసి రాజకీ యంగా, సైద్ధాంతికంగా ఎంతో అభివృద్ధి చెందాడని ప్రశంసించింది. మిలిటరీ రంగంలో విశేష అధ్యయనం చేసి ఎంతో నైపుణ్యాన్ని సా ధించాడని పేర్కొంది. శత్రు బలగాలనుంచి వందలకొద్దీ ఆయుధాలను స్వాధీనం చేసుకొని పీఎల్ జీఏను సాయుధం చేశాడని వివరించింది. హిడ్మా నాయకత్వంలో దక్షిణ సబ్‌ జోన్లో ప్రజారాజ్యాధికార అంగాలు (జనతన సర్కా ర్లు) నిర్మాణమయి, ప్రజారాజ్యాధికారం అమలైందని వివరించింది. ఆవిధంగా ప్రజల, క్యా డర్ల విశ్వాసాన్ని పొందాడని పేర్కొంది. హిడ్మాను ప్రజల హృదయాల్లో హిడ్మా స్థానం చెరిగిపోనిదని, ఆయన చరిత్ర భారత విప్లవోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని పేర్కొంది. కేవలం ఆదివాసీ సము దాయానికి మాత్రమే కాదు, పీడిత ప్రజల నా యకుడిగా స్థిరమైన స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించింది. దోపిడీ వ్యవస్థ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో కొనసాగాలని, కార్మికులు, రైతాంగం, యువతకు పిలుపునిచ్చింది.

హిడ్మాపై గోదీ మీడియా విషప్రచారం
పాలకవర్గ మీడియా, గోదీ మేధావులు ఎంతోకాలంగా హిడ్మాను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించారు. హత్య చేసిన తర్వాత ఇపుడు ఆ విష ప్రచారాన్ని బీజేపీ ఫాసిస్టు మనువాదుల అజమాయిషిలో మరింత పెట్రేగిపోయి చేస్తు న్నారు. ఇటువంటి దుర్మార్గ ప్రచారాలు ఎన్ని చేసిన ప్రజల హృదయాలలో హిడ్మాకు గల స్థానం చెరిగిపోనిది. భగత్ సింగ్, కొమురం భీం, గూండాదూర్, గేంద్ సింగ్, అల్లూరి సీతారామరాజుల చరిత్ర లాగానే హిడ్మా చరిత్ర భారత విప్లవోద్యమంలో చెరిగిపోని ముద్ర వేస్తుంది. ఆయన కేవలం ఆదివాసీ సముదాయానికి మాత్రమే నాయకుడు కాదు, పీడిత ప్రజల నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడని. ఈ చరిత్రను భవిష్యత్ తరాలు చదివి ప్రేరణ పొందుతాయని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు దేశ సంప దను, ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పజెపుతున్నారు. దీనికి వ్యతిరే కంగా దేశంలో ఎన్నో పోరాటాలు చెలరేగుతు న్నాయి. ఆ పోరాటాలన్నింటిని ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు దుర్మార్గంగా విచ్ఛిన్నం చేయడం, పక్కదారి పట్టించడం, అణచివేయడం చేస్తున్నారు. మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. పూటకొక నినాదం, రోజుకొక పథకాన్ని ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటిని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎన్నికల కమిషన్ మోదీ కి ‘గోది’ కమిషన్ గా మారిపో యింది. అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని బిహార్ ఎన్నికల్లో భారీ స్థాయి మోసాలు చేసి విజయాన్ని సాధించారు. దేశంలో ప్రతిపక్ష పార్టీల్ని మొత్తాన్ని నిర్మూలించి బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను సైతం ధ్వంసం చేసే పథకాన్ని అమలు జరుపుతు న్నారు. సీపీఐ (మావోయిస్టు) నాయకుడైన కామ్రేడ్ హిడ్మా వంటి సాహసోపేతులైన యుద్ధ సేనానుల చరి త్రను చూసి, ప్రేరణ పొంది ఫా సిస్టు ఆర్ఎస్ఎ స్-బీజేపీ మనువాదులకు వ్యతి రేకంగా సాగే పోరాటంలో పాల్గొంటూ, అంతి మంగా ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలనకై సాగే పో రాటంలో కొనసాగాలని కార్మికులకు, రైతాం గానికి, యువతకు, విద్యార్థులకు మరియు సామాజిక వర్గాలకు అభయ్ పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *