వారసత్వ సంపదను కాపాడుకోవాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: హెరిటేజ్‌ డిపార్టుమెంట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అర్జునరావు కుతాడి ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు ఈనెల 19 నుంచి 25 వరకు తెలంగాణ స్టేట్‌ మ్యూజియంలోని భగవాన్‌ మహావీర్‌ ఆడిటోరియంలో నిర్వహించారు.. దీనిలో భాగంగా చివరి రోజున మైల్‌ స్టోన్స్‌ ఇన్‌ తెలంగాణ హిస్టరీ అండ్‌ హెరిటేజ్‌ అనే అంశంపై డాక్టర్‌ ఇ.శివనాగిరెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా క్లుప్తంగా విద్యార్థినీవిద్యార్థులకు వివరించారు. వారసత్వ శాఖ సంచాలకుడు ప్రొఫెసర్‌ అర్జున్‌ రావు మాట్లాడుతూ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని, ఈ సంపదను భావితరాల వారికి అందించే బాధ్యత విద్యార్థినీవిద్యార్థులపై ఉందని ఉద్బోధించారు. ఈ వారోత్సవాలలో భాగంగా తెలంగాణ స్టేట్‌ మ్యూజియంలోని విద్యార్థినీ, విద్యార్థులకు క్విజ్‌ కాంపిటీషన్‌,ఎస్సే రైటింగ్‌ కాంపిటీషన్‌, పెయింటింగ్‌ కాంపిటీషన్‌ మరియు వారసత్వ శాఖ సిబ్బందికి క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. వ్యాస రచన, క్విజ్‌, పెయింటింగ్‌, క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను ప్రొఫెసర్‌ అర్జునురావు చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు డాక్టర్‌ పి.నాగరాజు, డాక్టర్‌ డి.రాములు నాయక్‌, ఎన్‌.నర్సింగ్‌, దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్ట్‌ చైర్మన్‌ వేదకుమార్‌, ఇంటెక్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ కో కన్వీనంఅనురాధ రెడ్డి, తెలంగాణ స్టేట్‌ మ్యూజియం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మల్లు, గంగాదేవి, అమర జ్యోతి, ఆక్స్ఫర్డ్‌ స్కూల్‌ హిమాయత్‌ నగర్‌ విద్యార్థినీవిద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర ఆర్కియాలజీ విద్యార్థులు, ప్రొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ చారిత్రక, పర్యాటక విభాగం విద్యార్థులు, ప్రభుత్వ సిటీ కాలేజ్‌ విద్యార్థులు, వారసత్వ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *