గిరియానం – 5
భారతదేశంలోని గురుద్వారాలన్నింటిలో హేమకుండ్ సాహిబ్అతి ఎత్తైన ప్రదేశంలో వుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలోవున్న ఈ ప్రదేశం సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టంనుంచి 15000 అడుగుల ఎత్తులో వుంది. చుట్టూ ఎత్తైన ఏడు పర్వతాలమధ్యలో హిమనదీయ సరస్సు ఇక్కడి ప్రత్యేకత. అక్టోబర్ నుంచి ఏప్రిల్వరకు మంచుతో కప్పబడి వుంటుంది. మే నెలలో సిక్కు యాత్రికులు వచ్చిమంచుతో కప్పబడిన మార్గాన్ని పునరుద్ధరిస్తారు. ఈ సంప్రదాయాన్నికరసేవ అని పిలుస్తారు. కరసేవలో పాల్గొనడానికి చాలా మందిస్వచ్ఛందంగా ముందుకు వస్తారు. ఇది సిక్కుల మత విశ్వాసం. పూర్వజన్మలో గురుగోవింద్ సింగ్ హేమకుండ్ దగ్గర కఠోరమైన తపస్సు చేసాడనిసిక్కుల పవిత్ర గ్రంథం ద్వారా తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం.. హేమకుండ్ సాహిబ్ నుప్రతి ఏడాది 1,50,000 మంది యాత్రికులు సందర్శిస్తారు. అందులోదాదాపు 50,000 మంది అక్యూట్ మౌంటెన్ సిక్నెస్ కు గురౌతారు. దానికి కారణం.. శారీరక దృఢత్వ లోపం, ట్రెక్ సమయంలో అవసరమైనమంచినీళ్ళు తాగకపోవడం, హై ఆల్టిట్యూడ్ సిక్ సెస్ పట్ల అవగాహనలేకపోవడం. ప్రస్తుత గురుద్వారా 1960లో నిర్మించబడింది. ఘంఘారియానుంచి ఆరు కిలో మీటర్ల దూరం. రోడ్డు మార్గం వుంటుంది. కానీ దారినిటారుగా వుండడం వల్ల ట్రెక్ చేయడం కష్టమే. గుర్రాలు, బాస్కెట్బాయ్స్, అందుబాటులో వుంటారు. హెలికాఫ్టర్ సౌకర్యం కూడా వుంది.కానీ మేము వెళ్ళినప్పుడు అది నిషేధంలో వుంది. గుర్రానికి ₹ 2800 /,బాస్కెట్ కు ₹ 7000/ ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు. గుర్రం మీదవెళితే రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు. బాస్కెట్ లో ఆరుగంటల్లోచేరుకోవచ్చు. దారి పొడుగునా చిన్న చిన్న పాక హోటల్స్ అందుబాటులోవున్నాయి. టీ, టిఫిన్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ దొరుకుతాయి.
నేను ఉదయం ఏడు గంటలకు అల్పాహారం ముగించిబయలుదేరాను. గురుద్వారా చేరే సరికి మధ్యాహ్నం రెండు గంటలైంది.నా స్నేహితులు నేను వెళ్ళేసరికే గుర్రాల మీద తిరుగుముఖం పట్టారు.ఆకాశం నిర్మలంగా వుంది. అందుకే హేమకుండ్ స్వచ్ఛమైన నీటినిచూడగలిగాను. అక్కడినుంచి గురుద్వారాలోకి వెళ్ళాను. లోపల అంతానిశ్శబ్దంగా వుంది.చాలా మంది స్త్రీ పురుషులు చలికి రగ్గులు కప్పుకొనిధ్యానం చేస్తున్నారు. లోపల అంతా తిరిగి చూసి లంగర్ పెట్టే ప్రదేశానికివెళ్ళాను. (లంగర్ అంటే గురుద్వారాలలో ఇచ్చే ప్రసాదం. అది టీ,భోజనం, కిచిడీ లాంటిది ఏదైనా కావొచ్చు.) అక్కడ వేడి వేడి కిచిడీ,టీ వుంది. అంత చలిలో ఆ వేడి పదార్థాలు అమృతతుల్యంగాఅనిపించాయి. మా గ్రూప్ వాళ్ళు కొందరు కనిపించారు.
బయటకు వచ్చేసరికి మేఘావృతమై చీకటి కమ్ముకుంది.ఆ చీకటిలో హేమకుండ్ కనిపించ లేదు. సరస్సుకు ఆవలి తీరంలో వున్నరామలక్ష్మణ ఆలయానికి వెళ్ళాను. దాని పక్కనే శివాలయం కూడావుంది. ఆ మసక వెలుతురులోనే పరిసర ప్రాంతాలన్నీ తిరిగి చూసాను.ప్రకృతి ఆడే దాగుడుమూతలాటను పరిశీలించాను. ప్రకృతి ముందుమానవులు ఎంత అల్పులో కదా.. అనిపించింది. పైన ఎలాంటి వసతిసౌకర్యం లేదు. మరింత ఆలస్యం చేస్తే సురక్షితంగా కిందకు చేరుకోవడంకష్టం. మనసు మైమరచిన వేళ బుద్ధి హెచ్చరించింది. తిరుగు ముఖంపట్టక తప్పలేదు. దారిలో పుష్పవతి నదీ జలపాతాలు, ఆకాశాన్ని తాకుతున్నాయా! అన్నట్లున్న పర్వత శిఖరాలు, వాటితో మేఘమాలికలసయ్యాటలు, అక్కడక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలు, ఆ ప్రాంతంలోమాత్రమే వికసించే బ్రహ్మకమలాలు, హిమాలయాల రాణిగా పిలువబడేబ్లూ పాపీ ఫ్లవర్స్, భిన్న వర్ణాల పూలతో కూడిన హరిత వర్ణపు చీరనుచుట్టుకున్న లోయలు.. ఇలా అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కను విందుచేసింది.
తెల్లవారి ఉదయం అల్పాహారం ముగించి పుల్వామాగ్రామానికి తిరుగు ప్రయాణం. గుర్రాల మీద కూడా వెళ్లొచ్చు. 9 కి మీదూరం. పైకి వెళ్ళేటప్పుడు ఒక్కరికి ₹ 1900/, కిందకు దిగేటప్పుడు ₹ 1300/లు. ఇవి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు. పుల్వామా నుంచి గోవిందఘాట్ కు 4.కి.మీ దూరం. ప్రభుత్వం అనుమతించిన జీపులలోనే వెళ్ళాలి. ఒక్కరికి ₹ 50/. అక్కడి నుంచి బద్రీనాథ్ కు 25 కిమీ దూరం. అందరం గోవింద ఘాట్ చేరే సరికి మధ్యాహ్నం మూడు గంటలైంది. అక్కడి నుంచిబద్రీనాథ్ కు 5. 30 ని లకు చేరుకున్నాం. వెళ్ళేసరికి వేడి వేడి పకోడి, టిసిద్ధంగా వున్నాయి.

గంట తర్వాత బద్రీనాథ్ ఆలయానికి వెళ్ళాను. మా వసతిగృహం నుంచి రెండు కిలోమీటర్ల దూరం వుంటుంది. నేను బద్రినాథ్ కువెళ్ళడం ఇది రెండోసారి. చార్ ధాం యాత్రలో భాగంగా గత యేడాదివేసవిలో వెళ్ళాను. దర్శనం కొరకు దాదాపు నాలుగైదు గంటలు లైనులోనిలబడివలసి వచ్చింది. ఆలయం రాత్రి 8-30 గంటల వరకు మాత్రమేతెరచి వుంటుంది కాబట్టి ఒకటే తోపులాట. ఈసారి సరిగ్గా ఆఅనుభవానికి భిన్నంగా వుంది. రద్దీ ఒక మోస్తరుగా వుంది. మామూలుఆలయంలోకి వెళ్ళినట్లుగా వున్నందువల్ల పలుమార్లు దర్శనంచేసుకుంటున్నారు భక్తులు. నేను ఒకసారి మాత్రమే దర్శనంచేసుకొని,తీరికగా ప్రాంగణమంతా తిరిగి చూసాను. చిన్నగా వర్షంపడుతోంది. మా స్నేహితులు వచ్చేదాకా పక్కనే వున్న ఎమర్జన్సీ మెడికల్క్యాంప్ లో కూర్చున్నాను. అక్కడ డ్యూటీలో వున్న అబ్బాయి తెలుగుమాట్లాడడం సంతోషమనిపించింది. ఆ అబ్బాయితో అదే చెప్పాను. “బద్రీనాథ్ కు ఎక్కువగా సౌత్ ఇండియన్స్ వస్తారని, దక్షిణ దేశ భాషలన్నీకొద్దిగా వచ్చునని ” చెప్పాడు.
బద్రీనాథ్ ప్రసిద్ధ వైష్ణవాలయం. సముద్ర మట్టంనుంచి 10,200 అడుగుల ఎత్తులో వుంది. వాతావరణ పరిస్థితుల రీత్యాఆరు నెలలు ఆలయాన్ని మూసి వేస్తారు. అప్పుడు నవంబర్ నుంచిఏప్రిల్ వరకు ఉత్సవ విగ్రహాలను జోషిమఠo లోని నారసింహ ఆలయంలో ఉంచిపూజలు నిర్వహిస్తారు. మేం జోషి మఠంలో ఆ ఆలయాన్ని కూడాచూసాము. రుషికేశ్ లో వశిష్ఠగుహలు 30 కిమీ దూరంలో ఉన్నాయి. రద్దీ లేని గంగానదీ తీరంలో ఉన్నందువల్ల మరింత ప్రశాంతతకు నెలవైవున్నాయి. పక్కనే కొంత దూరంలో అరుంధతీ గుహ కూడా వుంది. ఇద్దరిధ్యానానికి భంగం కలుగకుండా వేరు వేరు గుహలలో ఉన్నారు కాబోలు.అరుంధతి అలా తన వ్యక్తిత్వాన్ని చాటుకుందనిపించింది. జోషి మఠంవెళ్ళే దారిలో దారాదేవి ఆలయానికి వెళ్ళడానికి హై వే నుంచి సుమారురెండు కిలోమీటర్లు కిందకు దిగాలి. గంగానదిలో నిర్మించిన అందమైనఆలయం అది. అలకనంద, గంగానదుల సంగమం, జోషి మఠంలోనిశంకరాచార్య గుహలు ప్రకృతి సౌందర్యంతో యాత్రికులను ఆకర్షిస్తాయి.





