న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్

– పశ్చిమ ఆసియాలోని మన పౌరుల కోసం..

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 2: మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా)లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24/7 కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు
న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతోపాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విచారణలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు లేదా తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.

కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
(న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పనిచేస్తుంది)
వందన బరువా
పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ అండ్ లైజన్ హెడ్
91 9871999044
సీహెచ్.చక్రవర్తి
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
91 9958322143
జావేద్ హుస్సేన్
లైజన్ ఆఫీసర్
9910014749
రక్షిత్ నాయక్
లైజన్ ఆఫీసర్
91 9643723157


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *