– దిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు
న్యూదిల్లీ, సెప్టెంబర్ 10: ప్రస్తుతం నేపాల్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం అందనుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నేపాల్‌లో తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. నేపాల్‌లో ఎవరైనా తెలంగాణ వారు చిక్కుకుంటే వారి కుటుంబ సభ్యులు దిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రెటరీ అండ్ లైజన్ హెడ్ +91 9871999044. జి.రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్+91 9643723157, సిహెచ్. చక్రవర్తి, ప్రజా సంబంధాల అధికారి +91 9949351270 లలో సంప్రదించవచ్చు. తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ పౌరులకు నేపాల్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





