నళిని ఆరోగ్యం క్షీణించింది.. ఆదుకోండి

– రేవంతన హామీ మేరకు ఆమెకు సాయం చేయాలి
– మాజీ డీఎస్పీని పరామరిÊశంచిన బీజేపీ బఋందం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరన 22 : మాజీ డీఎస్పీ నళినిని ఆమె స్వగృహానికి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎనన.రామచందరనరావు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా నళిని ఆరోగ్య పరిస్థితి, ఆమె ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నళిని పోలీస్‌ శాఖలో ఉన్నప్పటికీ జై తెలంగాణ నినాదంతో ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఉద్యోగానికి రాజీనామా చేశారని, అయితే ఆమెను పోలీసు శాఖ సస్పెండ్‌ చేసిందని, ఇప్పటివరకు రావాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం నళినిని ఇబ్బందులకు గురిచేశాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ బెనిఫిట్స్‌ ఇంకా విడుదల కాలేదన్నారు. నళిని 16 పేజీలలో రిపోర్ట్‌ సబ్మిట్‌ చేసి పరిస్థితులను వివరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇతర కారణాలు చెబుతూ బెనిఫిట్స్‌ విడుదల చేయడం లేదని దుయ్యబట్టారు. ఫలితంగా ఆమె మానసిక వేదనకు గురయ్యారని, ఆరోగ్యం క్షీణించిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు మద్దతుగా నిలుస్తూ బీజేపీ బృందం ఆమెను పరామర్శించినట్లు తెలిపారు. తన పదవీ విరమణ వేతనం, ఇతర అధికారిక ప్రయోజనాలను సమాజ సేవ కోసం వినియోగిస్తానని ఆమె తెలిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రిటైర్మెంట్‌ ప్రయోజనాలను విడుదల చేసి ఆమెను మానసిక వేదనను తీర్చాలన్నారు. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ కోరితే ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం కలిసేలా ప్రయత్నిస్తామని రామచందరనరావు చెప్పారు. నళినిని కలిసిన బఋందంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాకటన్ర బూర నర్సయ్య గౌడ్‌, సీనియర్‌ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్‌, ఇతర సీనియర్‌ నాయకులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *