మునిగిన గ్రామాలు
పొంగిపొర్లుతున్న వాగులు
కొట్టుకుపోయిన రహదారులు ..రైల్వే ట్రాక్ లు
కామారెడ్డి జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షాలు వినాయక చవితి పండుగ పూట తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తిమ్మారెడ్డి వద్ద కల్యాణి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకున్నారు. వారు ప్రాణాలను కాపాడుకునేందుకు సమీపంలోని వాటర్ ట్యాంకర్‌పై ఎక్కి సహాయం కోసం ఎదురుచూశారు. స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. కామారెడ్డి-భిక్కనూర్ మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోవడంతో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్-కామారెడ్డి మార్గంలో రైళ్లను పూర్తిగా నిలిపివేశారు, మరికొన్ని రైళ్లను వేరే మార్గాల్లోకి మళ్లించారు. NH 44 భిక్కనూర్ నుండి కామారెడ్డి టోల్ ప్లాజా వరకు చిన్న రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లింగంపేట మండలంలో చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లాయి, దీంతో స్నానం కోసం చెరువుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు గల్లంతయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిపై స్పందిస్తూ, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. దోమకొండ గ్రామం పూర్తిగా నీట మునిగింది.

రైల్వే ట్రాక్ ధ్వంసం మరియు రైళ్ల రద్దు: బిక్కనూరు మండలం, రామేశ్వరపల్లి సమీపంలో ఉన్న నిజామాబాద్–హైదరాబాద్ రైలు ట్రాక్ వరద నీటికి తీవ్రంగా దెబ్బతినడంతో ధ్వంసమయ్యింది మరియు రైలు రాకపోకలు. నిలిపివేయబడ్డాయి . దక్షిణ మధ్య రైల్వే కూడా సురక్షిత చర్యలల్లో భాగంగా అనేక రైళ్లను రద్దు చేసింది.






