జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు…యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 :యాదగిరిగుట్ట మండలం, చొల్లేరు గ్రామములొ భారీ వర్షాల కారణంగా వాగులు వంకలలో వర్షం నీరు భారీగా ప్రవహిస్తుండడంతో చోలేరు రోడ్డు మీదుగా నిరు ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అప్రమత్తమైన అధికారులు రోడ్డుకు ఇరువైపులా బార్ గేట్లు ఏర్పాటు చేసి ఆ రోడ్డు మార్గంలో ప్రయాణాలను నిలిపివేశారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట తాసిల్దార్ ఆదేశాల మేరకు అధికారులు గ్రామ కరోబార్, సెక్రెటరీ, RI, పోలిసు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు..

గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామం పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పోయడంతో పెద్ద ఎత్తున వాగులు ప్రవహిస్తున్నాయి ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటికి వెళ్లాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.
యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి గ్రామంలో భారీ వర్షాల కారణంగా పెద్ద చెర్వు కట్ట బుంగ పడినందున అప్రమత్తమైన అధికారులు చెరువు కట్టకు పడిన బుంగను JCB సహాయంతో మట్టి పోసి పూడ్చారు.
చెరువు కట్టకు బుంగ పడటం వలన ఎలాంటి నీటి ప్రవాహం జరగలేదని గ్రామములో మనుషులకు గానీ పశువులకు, పంటలకు గానీ ఎలాంటి నష్టం జరగలేదు అని సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు…





