భారీ వర్షాలున్నాయ్‌.. అప్రమత్తంగా ఉండండి

– నిరంతరం ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తుండాలి
– అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అప్రమత్తం చేశారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్‌ గా ఉండి పరిస్థితిని సమీక్షించాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని కాజ్‌వేలను పరిశీలించాలని, రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్‌ను నిలిపివేయాలన్నారు. విద్యుత్‌ శాఖ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, అంతరాయం లేకుండా సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించటంతోపాటు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హైడ్రాతోపాటు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *