– తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: వేసవి భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్తను అందించింది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు వాతావరణం చల్లబడనుందని అంచనా. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణపై ప్రస్తుతం ఉన్న వాతావరణ ద్రోణి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరఠ్వాడా నుంచి కర్ణాటక తీరం వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ద్రోణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. దీని ఫలితంగా శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే ఈ ఉపశమనం తాత్కాలికమేనని, వచ్చే వారం నుంచి ఎండల తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉందని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికం కావచ్చని అధికారులు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





