రెండోరోజూ వలుచోట్ల భారీ వర్షం

పలు ప్రాంతాలు జలమయం.. ట్రాఫిక్‌ జాంజాటాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: భాగ్యనగరంలో రెండోరోజు శనివారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం కూడా భారీ వర్షం పడడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్న విషయం విదితమే. జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, బాలానగర్‌, బోయినపల్లి, ఆల్వాల్‌, మల్కాజ్‌గిరి, మౌలాలి, బేగంపేట్‌, మలక్‌పేట్‌, చార్మినార్‌, ముషీరాబాద్‌, అబిడ్స్‌, కోటి, హిమాయత్‌నగర్‌, కాచిగూడ, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, అశోక్‌ నగర్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ముషీరాబాద్‌, బంజారాహిల్స్‌, ఓయూ, తార్నాక, నాచారం, మల్లాపూర్‌, హబ్సిగూడ, కొత్తపేట, హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్‌బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట, సరూర్‌నగర్‌, గాజుల రామారం, కుత్బుల్లాపూర్‌, నిజాంపేట్‌, మియాపూర్‌, లింగంపల్లి, బాచుపల్లి, హఫీజ్‌పేట్‌, ఈసీఐఎల్‌, కప్రా, నేరేడ్‌మెట్‌, విద్యానగర్‌, నల్లకుంట తదితర ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కాగా ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులెదుర్కొన్నారు. రానున్న రెండు గంటల్లో నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసే అవకాశముందని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వరద నీటితో నిండిన ప్రాంతాల్లో తిరగకూడదని హెచ్చరించింది. ఫిర్యాదుల కోసం జీహెచ్‌ఎంసి 040-29555500, 9000113667 టోల్‌ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో వర్షాలు కురువనున్నాయి. నిన్నటి వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వరద ముంచేయడంతో ఆ పాంతాల ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు జిహెచ్‌ఎంసి సిబ్బంది బోట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *