భ్యానగరంలో భారీ వర్షం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: నగరంలోని శుక్రవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మెహదీపట్నం, మణికొండ, షేక్‌పేట్‌, గోల్కొండ, లంగర్‌హౌస్‌, బంజారాహిల్స్‌, తార్నాక, నాచారం, మల్లాపూర్‌, హబ్సిగూడ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్‌, మియాపూర్‌, మూసాపేట్‌ సహా బాలానగర్‌, ఎర్రగడ్డలలో భారీ వర్షం కురుస్తోంది. అలాగే మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, హకీంపేట్‌, కంటోన్మెంట్‌, ఖైరతాబాద్‌లోనూ భారీగా వర్షం పడుతోంది. ఆయా ప్రాంతాల్లో జనం ముఖ్యంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోగా పలువురు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. కాగా, వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. ఇలా ఉండగా, తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు (శనివారం) వరకూ పలు జిల్లాల్లో వానలు కురవనున్నట్లు వెల్లడిరచింది. హైదరాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మేడ్చల్‌ మల్కాజిగిరి, ములుగు, కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, పెద్దపల్లి, రంగారెడ్డి వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

భారీగా ట్రాఫిక్‌ జాం

షేక్‌పేట్‌, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలిలో భారీ వర్షం కారణంగా జనం అవస్థలు పడుతున్నారు. కొండాపూర్‌, హఫీజ్‌ పేట్‌, మాదాపూర్‌, మియాపూర్‌ లో భారీ వర్షం పడిరది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. రాయదుర్గం, షేక్‌పేట్‌ మార్గంలో 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో ఐటీ కారిడార్‌ ఉంది. కొన్ని రోడ్లు నాలాలను తలపిస్తున్నాయి. రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గచ్చిబౌలి పిజేఆర్‌ ఫ్లైఓవర్‌ పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. హఫీజ్‌పేట్‌, ఆల్విన్‌ కాలనీ, చందానగర్‌, హైటెక్‌ సిటీ, కెపీహెచ్‌బీ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ ఉంది. టోలిచౌకి, మెహదీపట్నం మార్గంలోనూ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కిలోమీటరు ప్రయాణానికి గంటకుపైగా సమయం పడుతోంది. టోలిచౌకి నానల్‌ నగర్‌ జంక్షన్‌ వద్ద నాలా పొంగిపొర్లుతోంది. గ్రేటర్‌లో 7.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకురావద్దంటూ హైడ్రా నగరవాసులకు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు, సంగారెడ్డి జిల్లాలోనూ పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, పటాన్‌చెరు, ఆర్సీ పురం, జిన్నారం, సదాశివపేట మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *