భారీ వర్షం.. నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్‌, మియాపూర్‌, మూసాపేట్‌ సహా బాలానగర్‌, సనత్‌నగర్‌, ఎర్రగడ్డలో, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, హకీంపేట్‌, కంటోన్‌మెంట్‌, ఖైరతాబాద్‌లోనూ భారీగా వర్షం పడుతోంది. ఆయా ప్రాంతాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోగా పలువురు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. వర్షం తగ్గేంత వరకూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది.

మూడు రోజులపాటు వర్షాలు!

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం వరకు వానలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడిరచింది. హైదరాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మేడ్చల్‌ మల్కాజిగిరి, ములుగు, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి, రంగారెడ్డి వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *