మీ సృజనాత్మకతతో కొత్త శిఖరాలకు తెలుగు చిత్రసీమ

– భగవంత్‌ కేసరి, హునుమాన్‌ బృందాలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు అందుకున్న భగవంత్‌ కేసరి చిత్ర బృందానికి, యానిమేషన్‌ అండ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఉత్తమ చిత్రం పురస్కారం అందుకున్న హనుమాన్‌ చిత్ర బృందానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే బలగం చిత్రానికి ఉత్తమ గీత రచయిత అవార్డు అందుకున్న కాసర్ల శ్యాం, బేబీ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు పొందిన సాయి రాజేశ్‌, అదే చిత్రానికి ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు అందుకున్న రోహిత్‌, గాంధీ తాత చెట్టు చిత్రానికి ఉత్తమ బాల నటిగా అవార్డు అందుకున్న సుకృతి బండ్రెడ్డి, హనుమాన్‌ చిత్రానికి ఉత్తమ స్టంట్‌ కొరియోగ్రఫీ అవార్డు అందుకున్న నందు, పృధ్విలకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మీ అందరి కృషి, సృజనాత్మకత తెలుగు చిత్రసీమను కొత్త శిఖరాలకు చేర్చిందన్నారు. మీ విజయాలు యువతకు ప్రేరణగా నిలవాలని, భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలను సాధించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *