– విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్ట్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్, హరీష్ రావు, ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన ఈ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసీఆర్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. సాక్షులు ఎవరైనా పిటిషనర్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు నోటీస్ జారీ చేసి వారి వాదన వినాలని చట్టం చెబుతోందని అన్నారు. నివేదికలో తీవ్ర ఆరోపణలు చేయడం, పిటిషనర్ పరువు, కీర్తికి నష్టం కలిగేలా చేయడం సరైంది కాదని హైకోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కూడా పలు అంశాలను ప్రస్తావించారు. ’కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. కేసీఆర్, హరీశ్ రావుకు విచారణ కమిషన్ తగిన అవకాశం ఇచ్చింది. తన విధులు నిర్వహించడంలో స్మిత సబర్వాల్ విఫలం అయ్యారని నివేదికలో ఉంది అని హైకోర్టు ధర్మాసనంకు తెలియజేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకి వాయిదా వేసింది.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.