కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ 24కు వాయిదా

 హెచ్‌సీయూ భూ వివాదంపై సోమవారం హైకోర్టులో  ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్‌ ‌బెంచ్‌ ‌పేర్కొంది. ఈ కేసులో కౌంటర్‌రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీం కోర్టుహైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో హెచ్‌సీయూ భూములపై విచారణ జరుగగా.. పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున ఈనెల 24కు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 24 లోపు రాష్ట్ర ప్రభుత్వంపోలీసులు కౌంటర్‌ ‌దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించారు. అలాగే స్టేటస్‌ ‌రిపోర్టు ఫైల్‌ ‌చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు.

దీంతో ఫేక్‌ ‌వీడియోఫారెస్ట్ ‌తగులబెట్టిన వీడియోలపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్‌ ‌రిపోర్టుపై పోలీసులే కౌంటర్‌ ‌దాఖలు చేస్తారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు తెలిపడంతో తదుపరి విచారణ 24కు వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు కంచ గచ్చిబౌలి భూములపై ఏఐని ఉపయోగించి కొన్ని సోషల్‌ ‌మీడియాలో సర్క్యూలేట్‌ ‌చేయడంపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా బీఆర్‌ఎస్‌ ‌నేత మన్నె క్రిశాంక్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి సోషల్‌ ‌మీడియాలో పోస్ట్ ‌చేసినందుకు క్రిశాంక్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈనెల 9,10, 11న గచ్చిబౌలి పోలీస్‌ ‌స్టేషన్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *