– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్5: కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్‌చార్జ్ వీసీగా డాక్టర్ రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. గతంలో డీఎంఈగా పనిచేసిన విషయం తెలిసిందే. కాగా, అక్రమ మార్గంలో విద్యార్థులను పాస్ చేశారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న క్రమంలో నందకుమార్‌రెడ్డి వీసీ పదవికి రాజీనామా చేశారు. ఐదుగురు విద్యార్థులు అక్రమ మార్గంలో పాస్ అయ్యారని వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నది. ఇలాంటి నాటకీయ పరిణామాల మధ్య డాక్టర్ రమేష్ రెడ్డిని ఈ నియామకం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.