– ప్రతి ఊరికో నర్సు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
– మంత్రి దామోదర్ రాజనర్సింహ
– నాగర్ కర్నూల్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నాగర్ కర్నూల్, ప్రజాతంత్ర, జనవరి 19 : సమాజంలో మార్పుకు చదువే నాంది పలు కుతుంది. విద్య ద్వారానే అవగాహన పెరిగి సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది అని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ నియో జకవర్గంలో పర్యటించిన ఆయన, ప్రతి గ్రా మంలో కనీసం ఒకరైనా నర్సింగ్ విద్యనభ్య సించిన వారు ఉండాలని తన ఆకాంక్షను వ్య క్తం చేశారు. మంత్రి దామోదర్ రాజన ర్సిం హ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామో దర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్లతో కలిసి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణపై ప్ర త్యేక దృష్టి సారించామన్నారు. ప్రతి ఊరిలో నర్స్ విద్య చదివిన వారు ఉంటే అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చని, అందుకే వైద్య విద్యను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి కార్పొరేట్ స్థాయికి దీటైన నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి నాగర్ కర్నూల్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





