భారత్ ఫ్యూచర్ సిటీలో ‘హెల్త్ సిటీ’

– అంతర్జాతీయ ప్రమాణాలతో రోల్ మోడల్‌గా అభివృద్ధి
– కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌తో మారుమూల ప్రాంతాలకు వైద్యం
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా హెల్త్ సిటీని అభివృద్ధి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ వంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సాయంతో మారుమూల ప్రాంతాలకూ వైద్య సౌకర్యాలను చేర్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని వివరించారు. ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టి-హబ్‌లో సోమవారం నిర్వహించిన ‘టీఏఎల్ హాస్పిటల్స్ హెల్త్ ఫెస్ట్ 2026’ ఫైర్ సైడ్ చాట్ లో ఆయ‌న‌ వివరించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైలింగ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. మహిళలందరికీ ముందస్తు క్యాన్సర్ నిర్థారిత పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలను మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందేలా టెక్నాలజీ వినియోగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గా తెలంగాణను మార్చాలనే సంకల్పంతో ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామన్నారు. హెల్త్ కేర్ రంగంతోపాటు ఇతర రంగాల్లోనూ ఆరఅండ్‌డీకి పెద్దపీట వేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించామశ్రీధర్‌బాబు అన్నారు. నేటి మార్కెట్ అవసరాలÅ£నుగుణంగా పరిశ్రమలకు అవసరమైన ‘రెడీ టు వర్క్ ఫోర్స’ను తయారు చేసే బృహత్తర బాధ్యతను ప్రభుత్వం తీసుకుందన్నారు. మూడు నుంచి నాలుగు నెలల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌ను లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్‌కు దీటుగా రాష్ట్రంలోని టైర్ 2, 3 నగరాలను కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. హెల్త్ కేర్ రంగంలో టెక్నాలజీ మిళితం చేసి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే ఆవిష్కర్తలను ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తోందని, తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని వారిని మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో నిర్వాహకులు సాయి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *