– సచివాలయంలో హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: మారుతున్న జీవన శైలిలో భాగంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికీ ఉందన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ అంబేడ్కర్ సచివాలయంలోని ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం రెనోవా హాస్పిటల్స్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ బేస్డ్ మెగా కార్డియాక్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్వంలో ఉద్యోగులకు రెనోవా హాస్పిటల్ వైద్య సిబ్బంది అత్యాధునిక పరికరాల సాయంతో బీపీ, జీఆర్‌బీఎస్, ఈసీజీ, 2డి ఎకో పరీక్షలను నిర్వహించారు. కార్డియాలజీ, జనరల్ ఫిజీషియన్ సేవలను, ఫ్రీ కన్సల్టేషన్ సేవలను అందించారు. ఈ సందర్బంగా మంత్రి దామోదర మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు హెల్త్ క్యాంపు పెట్టి వైద్య సేవలను, పరీక్షలను ఉచితంగా అందించిన రెనోవా హాస్పిటల్ వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





