-పుంజుకుంటున్న బీజేపీ
– ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం
– సంక్షేమ పథకాలు సత్ఫలితాలివ్వడంలేదు
– మహిళలు, మధ్యతరతిలో పెరుగుతున్న వ్యతిరేకత
– బీజేపీలో నాయకత్వ లేమి సుస్పష్టం
-ముస్లింలు కాంగ్రెస్ పక్షమే
– ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ సర్వే
– సర్వే నిర్వహించిన పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్
– ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం
– సంక్షేమ పథకాలు సత్ఫలితాలివ్వడంలేదు
– మహిళలు, మధ్యతరతిలో పెరుగుతున్న వ్యతిరేకత
– బీజేపీలో నాయకత్వ లేమి సుస్పష్టం
-ముస్లింలు కాంగ్రెస్ పక్షమే
– ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ సర్వే
– సర్వే నిర్వహించిన పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్
కర్ణాటకలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని వెల్లడైంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించిన ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ సర్వేలో వెల్లడైంది. సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తొలి 24 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదరణ తగ్గుతున్న దశలో రానున్న 36 నెలలు కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత కీలకం కానున్నది.
సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా మొదటి దశలో ఉన్న ఆదరణ రెండో దశలో తగ్గడం సహజం. మొదటి రెండు సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరణ కోల్పోతుంటే రానున్న మూడేళ్ల కాలంలో తమ ప్రతిష్టను ఏ విధంగా కాపాడుకుంటుందన్నది వేచి చూడాలి. కర్ణాటకలో ఇప్పటికప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలోకి వొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గిపోయిందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ సర్వేలో వెల్లడైంది. కర్ణాటకలో 1985 నుం డి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తదుపరి ఎన్నికల్లో సొంతంగా సంపూర్ణ మెజార్టీ సాధించలేదనే అంశం ఇక్కడ గమనించాలి. ఇదే ట్రెండ్ ఈ సారి కూడా కొనసాగే అవకాశాలున్నట్లు స్పష్టమౌతోంది. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10,481 శాంపిల్స్తో 17 ఏప్రిల్ నుండి 18 మే వరకు, నెల రోజులపాటు ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ ట్రాకర్ పోల్ నిర్వహించింది.
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలుండగా, మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ 51 శాతం వోట్లతో 136-159 స్థానాలు, కాం గ్రెస్ 40.3 శాతం వోట్లతో 62-82 స్థానాలు, జేడీ(ఎ స్) 5 శాతం వోట్లతో 3-6 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని వెల్లడైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ 10.7 వోట్ల శాతం స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. పహల్గాం ఘటన, అనంతరం ఆపరేషన్ సిందూర్ కూడా బీజేపీకి అనుకూలంగా మారాయి.
పాకిస్తాన్తో కాల్పుల విరమణ తర్వాత, అంటే మే 10వ తేదీ తర్వాత బీజేపీకి 1 -1.5 శాతం వోటర్ల మద్దతు పెరిగినట్టు సర్వేలో స్పష్టమైంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42.88 శాతం వోట్లతో 135 స్థానాలు, బీజేపీ 3 6 శాతం వోట్లతో 66 స్థానాలు, జేడీ(ఎస్) 13.29 శాతం వోట్లతో 19 స్థానాలు గెలుపొందగా, ఈ రెండేళ్ల వ్యవధిలో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వొస్తుందని ప్రశ్నించినప్పుడు 55 శాతం మంది బీజేపీ, 39.1 శాతం మంది కాంగ్రెస్ అని, 3.6 శాతం మంది జెడి(ఎస్) అని, 2.3 శాతం మంది ఇతరులు అని పీపుల్స్ పల్స్ –





