‘నేను చెబుతున్న మొదటి దయ్యం అతనే’

– అతనే గుంపు మేస్త్రీ రేవంత్‌కు గూఢఛారి
– కేసీఆర్‌ ఎన్ని ఇడ్లీ తిన్నాడన్నది చేరవేసే ఏజెంట్‌
-‌ మాజీ ఎంపి సంతోష్‌ ‌రావుపై మండిపడ్డ కవిత

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: తాను చెప్పిన మొదటి దయ్యం సంతోష్‌ ‌రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.  ఉద్యమకారులకు ఉద్యమ నాయకుడిని దూరం చేసింది అతనేనని ఘాటుగా విమర్శించారు. గద్దర్‌ ‌లాంటి నాయకులు గేటు బయట ఉండాల్సి వచ్చిందంటే దానికి కారణం ఆయనేనని ఆరోపించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్‌ ‌కానిస్టేబుల్‌ ‌సౌమ్యను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.  బీఆర్‌ఎస్‌ ‌మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ ‌రావుకు ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ‌నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత సంచలన కామెంట్స్ ‌చేశారు. సంతోష్‌ ‌రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ’కేసీఆర్‌ ‌దగ్గర ఉన్న మొదటి దెయ్యం సంతోష్‌ ‌రావు’ అని వ్యాఖ్యానించారు. రేవంత్‌ ‌రెడ్డికి ప్రధాన గూఢాచారి కూడా సంతోష్‌ ‌రావేనని ఆరోపించారు.ఫాంహౌస్‌లో కేసీఆర్‌ ‌ఫుల్‌ ఇడ్లీ తిన్నారా? సగం ఇడ్లీ తిన్నారా? అనే సమాచారాన్ని రేవంత్‌కు సంతోష్‌ ‌చేరవేస్తాడని వ్యంగ్యస్త్రాలు సంధించారు. బీఆర్‌ఎస్‌లో ఎందరో నేతలతో కన్నీళ్లు పెట్టించిన దుర్మార్గుడు సంతోష్‌ అని మండిపడ్డారు. ప్రగతి భవన్‌ ‌గేటు బయట గద్దర్‌ను నిలబెట్టింది, ఈటల బీఆర్‌ఎస్ నుంచి ‌సస్పెండ్‌కు కారణం సంతోష్‌ ‌రావే అని కవిత ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్‌ను ఉద్యమకారులకు, పేద ప్రజలకు దూరం చేశారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి అనుకూలంగా కేటీఆర్‌, ‌హరీశ్‌ ‌రావులు  ట్వీట్లు పెట్టడాన్ని బీఆర్‌ఎస్‌ ‌క్యాడర్‌ ‌గమనించాల‌న్నారు. బీఆర్‌ఎస్‌లో అన్ని దుర్మార్గాలకు కారణం సంతోష్‌ ‌రావేనని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి సంతోష్‌రావు గూఢచారి. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ‌ఎలాంటి శిక్ష విధిస్తుందనేది వేచి చూడాలి. గుంపు మేస్త్రీ రేవంత్‌ ‌తన గూఢ‌చారిని ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కాపాడుకుంటాడని.. సిట్‌ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కవిత డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో ఎక్సైజ్‌ ‌పోలీసులంటే గంజాయి సరఫరాదారులు, స్మగ్లర్లకు భయం లేదని కవిత అన్నారు. ఎక్సైజ్‌ ‌పోలీసులు, అటవీశాఖ సిబ్బంది వద్ద ఆయుధాలు ఉంటేనే భయం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో గృహ హింస పెరిగిపోతోందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *