– ఎక్స్ వేదికగా హరీష్ రావు పోస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికి 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ అకౌంట్‌లో ఓ ట్వీట్ చేశారు. బిల్ ఈజ్ పాస్డ్ అన్న టైటిల్‌తో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన క్రమాన్ని తన పోస్టులో ఆయన వెల్లడించారు. 2014 ఫిబ్రవరి 20వ తేదీన తెలంగాణ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించిందన్నారు. శాంతియుతంగా సాగిన స్వరాష్ట్ర ఉద్యమానికి సంకేత సూచకంగా బిల్లు పాసైనట్లు హరీష్ రావు తన పోస్టులో పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైనట్లు తెలిపారు. కేసీఆర్‌తో కలిసి విక్టరీ సంకేతం చేస్తున్న ఫోటోను అందులో పోస్టు చేశారు. కొన్ని దశాబ్దాల త్యాగం, పోరాటం, ఆత్మగౌరవం.. చివరకు కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



