ఆశా వర్కర్ల జీతాలపై హామీ మరిచారా?

– అసెంబ్లీలో ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 25: ఎన్నికల సందర్భంగా వోట్లు దండుకోవడం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పై బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా సర్కారుపై నిప్పులు చెరిగారు. ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం ఇస్తామని కాంగ్రెస్‌ ‌పార్టీ నాడు తన ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్నదని ఆయన గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్‌ ‌తన మానిఫెస్టోలో పేర్కొన్న మేరకు ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం ఎప్పటి నుంచి ఇస్తుందని ప్రశ్నించారు. గత వారం రోజులుగా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం వారికి రూ.18 వేల కనీస వేతనం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్‌ ‌కిట్‌ను కూడా బంద్‌ ‌చేశారని విమర్శించారు. దాంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్‌స్టిట్యూషనల్‌ ‌డెలివరీలు 20 శాతం తగ్గాయని చెప్పారు. దీనిపై ప్రభుత్వ చర్యలు ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌కిట్‌ను ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభిస్తారో చెప్పాలని నిలదీశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *