అన్నదాత పోరాటంలో ఎర్రన్నలెక్కడ..?

నిజానికి తెలంగాణలో కమ్యూనిస్ట్‌ల అవసరం ఎంతో ఉంది..వారి పోరాటాలు జనాలకు ముఖ్యం. రాష్ట్రంలో కాంగ్రెస్బీజేపీ పార్టీలపై ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్‌పై అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో ప్రజలకుపార్టీలకు గ్యాప్‌ ఉంది. ఇలాంటి టైంలో ప్రజలకు కాస్తో కూస్తో నమ్మకం ఉన్న కమ్యూనిస్ట్‌ పార్టీలు ఇవాళా ప్రజల పక్షాన నిలబడాల్సిన అవశ్యకతఅవసరం ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం  లెఫ్ట్ పార్టీలు చేయడం లేదు.ప్రజల వైపు కాకుండా పాలకుల వైపు నిలబడుతున్నారు..”

తెలంగాణలో ప్రజా ఉద్యమాలను కమ్యూనిస్టులు వదిలేశారా అంటే.. రెండేళ్లుగా రాష్ట్రంలో ఆ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే అవుననే సమాధానం వస్తుంది. 20 నెలలుగా ఆ పార్టీల  చెప్పుకోదగ్గ పోరాటాలు ఏమీ లేవు. ఎర్ర జెండాల రంగు ఎలిసిందా లేక ప్రజల సమస్యలు మనకేందుకులే అని వదిలేశారో తెలియదు గానీ జనాలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను అడ్రస్‌ చేయలేదు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవా..?. కమ్యూనిస్ట్‌ పార్టీలు చేసే స్థాయి ఉద్యమాలు కావా.? అంటే దానికి ఆ పార్టీలే సమాధానాలు చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఎందుకో ఎర్రన్నలు నిద్రావస్థలో ఉన్నారు. ప్రజలతో కలిసి పోవడంతో విఫలం అవుతున్నారు. పార్టీ ఆఫీస్‌లో తప్ప ప్రజా క్షేత్రంలో కనిపించడం లేదు. ప్రజలు చేస్తున్న ఏ పోరాటంలో ఎర్రజెండాలు కనిపించం లేదు. కార్మికులు, రైతు, నిరుద్యోగులు, విద్యార్థి, శ్రమైక జీవుల సమస్యలు లేవనో, సోషలిజం, కమ్యూనిజం వచ్చిందనో అనుకుంటున్నారేమో అందుకే  ప్రజల సమస్యలపై ఎక్కడా యాక్టివ్‌ పోరాటాలు చేయడం లేదు.

ప్రజల సమస్యలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మార్పు పాలనపై మండిపడుతున్నారు. అధికారంలో మార్పు వచ్చింది తప్ప, తమ జీవితాల్లో మార్పు రాలేదని కోపంతో ఉన్నారు.వెరసి తమ బతుకులు పెనం నుంచి పోయిలో పడ్డదన్న అవేశంతో ఉన్నారు. లెఫ్ట్‌ పార్టీలు రాష్ట్రంలో అధికార పార్టీకి దాసోహం అయ్యాయి. కమ్యూనిజం సిద్ధాంతానికి విరుద్దంగా  పాలక పక్ష భజనలో మునిగిలేతున్నారు. అధికార పార్టీకి తోక పార్టీగా మారిపోయారు. పోనీ పాలక వర్గం భజన చేస్తూ రాజకీయంగా బలోపేతం అవుతున్నారా..?. కమ్యూనిజాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి వర్గ చైతన్యాన్నిపెంపొందిస్తున్నారా.?. ప్రభుత్వంలో వెసులుబాటు కల్పించుకుని ప్రజా పోరాటాలు  నిర్మిస్తున్నారా.? అంటే ఏదీ లేదు. రెండేళ్లుగా తెలంగాణలో ఒక్క ప్రజా పోరాటాన్ని ఎర్రజెండాలు లీడ్ చేయలేదు.ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదు. ప్రజలను చైనత్యం చేసింది లేదు. ప్రజా క్షేత్రంలో తిరిగింది లేదు. కేవలం పదవులు, అధికారాన్ని మాత్రమే అనుభవిస్తున్నారు.

కమ్యూనిస్ట్ పార్టీలు తమ పోరాట ఎజెండాల నుంచి ప్రజా ఉద్యమాలను తొలిగించినట్లున్నారు..ప్రజా పోరాటలు నిర్మించే సిద్దాంతం నుంచి  ప్రజలను చైతన్యం చేయాలన్న దీర్థకాలిక లక్ష్యాలను వదిలేసినట్లు ఉన్నారు. కేవలం అధికార పార్టీలకు  బీ టీంగా, తోక పార్టీగా మారినట్లు అర్థమవుతుంది. సహజంగా పాలక వర్గాల అణిచివేతలు, అన్యాయాలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో అంతిమంగా బాధితులు కమ్యూనిస్ట్‌ పార్టీలతో చెప్పుకుంటారు. ఉద్యమాలు, పోరాటలతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతారు. కానీ ఇవాళా కమ్యూనిస్ట్‌లు తమ బాధ్యతల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఏ పాలక వర్గంతో బాధితులు వేధించ బడుతున్నారో అదే ప్రభు వర్గాలతో లెఫ్ట్ పార్టీలు రాసుకుపూసుకు తిరుగుతున్నారు. ఈ రోజు ప్రజలు కమ్యూనిస్ట్‌ పార్టీలకు దూరం కావాడానికి, ఎర్రజెండాల గోడుగు కిందకు వచ్చి సమీకృతమైన చైతన్యం కాక పోవడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఆ పార్టీలు పాలక వర్గాల గోడుగు కిందకు పోవడమే కారణం. పీడితుల పక్షాన ఉండాల్సిన ఎర్రన్నలు పీడించే వారి పంచన చేరడంతో  కమ్యూనిస్ట్‌లు కనుమరుగైతున్నారు..అదే టైంలో దేశంలో కమ్యూనిజానికి  ఆధారణ పెరుగుతుంది. లెనినిజం, మావోయిజం, సోషలిజంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే తెలంగాణలో కమ్యూనిజాన్ని, కమ్యూనిస్ట్ పార్టీలను వేరుగా చూడాల్సిన పరిస్థితి ఆ పార్టీలు తెచ్చుకున్నాయి.

తెలంగాణలో కమ్యూనిస్ట్‌ ఉద్యమాల ప్రజా చైతన్యం ఎక్కువ.ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. ప్రభుత్వాలను నిలబెట్టాలన్న, పడగొట్టాలన్న కమ్యూనిస్ట్‌లదే కీలకపాత్రన్నారు. అలాంటి లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు అధికార పార్టీకి దాసోహం అయ్యాయన్న విమర్శలు ఎదుర్కోంటుంది. రెండేళ్ల నుంచి అసలు కమ్యూనిస్ట్‌ పార్టీలు ప్రజల్లోకి రావడం లేదని, ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడం లేదన్న అభిప్రాయం పెరుగుతుంది. రాష్ట్రంలో అనేక సమస్యలిప్పుడు ప్రజలను వేధిస్తున్నాయి. పీడిత వర్గాల నిలబడాల్సిన ఎర్రజెండాలు అధికార పార్టీ ఆఫీస్‌లో బంధీలయ్యాయన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఏ బడుగుబలహీన వర్గాలైతే లెఫ్ట్ పార్టీలకు మద్దతుగా ఉన్నారో వారే ఎర్రన్నలపై అసంతృప్తితో ఉన్నారు. నిరుద్యోగులు, రైతు, కార్మిక, ప్రభుత్వోద్యోగులు, శ్రమైక జీవులు గత రెండేళ్లుగా ఆందోళనలు చేస్తుంటే కమ్యూనిస్ట్‌ పార్టీలు మౌనంగా ఉంటున్నాయి. నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించినట్లు లెఫ్ట్ పార్టీల ప్రజా ఉద్యమాలు ఉంటున్నాయి..ప్రజలు పోరాటాలు చేయాలని చెపుతూనే ఆ పోరాటలను ఉద్యమాలను అణిచివేసే పాలక వర్గం పంచన చేరుతున్నారు. ప్రజలు చేస్తున్న ఆందోళనలకు కనీసం బహిరంగంగా మద్దతు ప్రకటించలేని పాతాళానికి లెఫ్ట్ పార్టీలు దిగజారిపోయి.

 రాష్ట్రంలో రైతులు, యువత, కార్మికులు,  నిరుద్యోగుల సమస్యలపై కమ్యూనిస్ట్‌లు మాట్లాడం లేదు. సంఘటిత, అసంఘటిత కార్మికుల పోరాటాలకు లెఫ్ట్ మద్దతు ఇవ్వడం లేదు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, బతుకుదెరువు కోసం అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు ప్రభుత్వంపై పోరాటం చేస్తే కమ్యూనిస్ట్‌లు మాట్లాడలేదు,  మద్దతు ప్రకటించలేదు. వెరసి పాలక వర్గం గూటికి చేరి కార్మికులకు రైతులు , నిరుద్యోగులకు ద్రోహం చేస్తున్నారు. మహిళలు, మహిళ ఉద్యోగులు, అంగన్‌వాడీలు అందోళనలు చేస్తే పట్టించుకోలేదు. వారి సమస్యలకు పరిష్కారం చూపించలేకపోతున్నారు. ప్రభుత్వ, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సర్కారు తీరుకు వ్యతిరేకంగా  ఆందోళనకు సిద్దం అయితే మాట వరుసకైన మద్దతు ఇవ్వలేదు. తమ అనుబంధ సంఘాలున్నాయి. వారు ఆయా వర్గాల పోరాటాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి అని తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ పార్టీ స్టాండ్ ఏంటో అంశాల వారిగా ఎజెండా ఏంటో నిర్ణయించేది మాత్రం పార్టీ నాయకత్వమే అన్నది వాస్తవం.

పోడు రైతుల సమస్యలను లెఫ్ట్‌ పార్టీలు పట్టించుకోలేదు. రైతు కూలీలు, కౌలు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై మాట్లాడటం లేదు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ప్రస్తావించడం లేదు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు. చివరికి అజ్ఞానంతో ఉన్న మావోయిస్ట్ పార్టీ ప్రజల సమస్యలపై మాట్లాడుతుంది కానీ, మైదానంలో ఉండి, ఎన్నికల బరిలో నిలిచే కమ్యూనిస్ట్‌ పార్టీలు మాత్రం మాట్లాడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.రైతులను క్యూలైన్లో నిలబెట్టి వేధించే పరిస్థితి సర్కార్ తీసుకువచ్చిన లెఫ్ట్‌ పార్టీలు మాట్లాడం లేదు. రైతులపై పోలీసులు జులం  ప్రదర్శిస్తూ, లాఠీలతో కొట్టుతున్నా మౌనంగా ఉంటారు. రైతులు, యువత, కార్మికులే కదా కమ్యూనిజానికి పునాది మరీ వారి సమస్యలనే ఎర్రజెండాలు పట్టించుకోక పోతే మరీ కమ్యూనిజం ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుంది.?.ప్రజల సమస్యల కంటే అధికారం పదవులే కమ్యూనిస్ట్‌లకు ముఖ్యమా.?

 నిజానికి తెలంగాణలో కమ్యూనిస్ట్‌ల అవసరం ఎంతో ఉంది..వారి పోరాటాలు జనాలకు ముఖ్యం. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్‌పై అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో ప్రజలకు, పార్టీలకు గ్యాప్‌ ఉంది. ఇలాంటి టైంలో ప్రజలకు కాస్తో కూస్తో నమ్మకం ఉన్న కమ్యూనిస్ట్‌ పార్టీలు ఇవాళా ప్రజల పక్షాన నిలబడాల్సిన అవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం  లెఫ్ట్ పార్టీలు చేయడం లేదు.ప్రజల వైపు కాకుండా పాలకుల వైపు నిలబడుతున్నారు.

  ప్రభుత్వం గోడుగు కింద ఉంటూ అధికారం కల్పిస్తున్న వెసులుబాటుతో  బలోపేతమయ్యే ప్రయత్నం చేయడం లేదు. పైగా మిగతా పార్టీలకు తోక పార్టీలుగా మారుతున్నాయి తప్ప, స్వయంగా అధికారంలోకి వస్తామన్న భరోసా నేతలు క్యాడర్‌కు ఇవ్వడం లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారపు ఊయల్లో నేతలు సేద తీరుతున్నారు. ఇది కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల కంటే అత్యంత ప్రమాదకరమైన ధోరణి. అసలు ఇది కమ్యూనిజం కాదు..కమ్యూనిస్ట్‌ పార్టీల ఎజెండా ఎలా అవుతుంది.?.ఫక్త్ బానిస జెండానే. కమ్యూనిజానికి వ్యతిరేక ఎజెండానే. ఆ ధోరణి భవిష్యత్ కమ్యూనిస్టు ఉద్యమాలకు ప్రమాదకారకంగా మారనుంది.

 -తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *