డిజిపిని కలిసిన హ్యాట్రిక్ ‘ఓవరాల్ ఛాంపియన్’ విజేత‌లు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 6: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇటీవల ముగిసిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ లో హ్యాట్రిక్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించిన‌ తెలంగాణ పోలీస్ ప్రతినిధులు డిజిపి బి శివధర్ రెడ్డిని డిజిపి కార్యాలయంలో సోమవారం కలిశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పోలీస్ బృందం వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్ ఛాంపియన్’ ట్రోఫీని కైవసం చేసుకుని అద్భుతమైన హ్యాట్రిక్ సాధించిన విషయం విదితమే.2023-24లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో, 2024-25లో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన పోటీల్లోనూ విజేతగా నిలిచిన తెలంగాణ, ఇటీవల నాగ్‌పూర్ వేదికగా ముగిసిన డ్యూటీ మీట్ లో హ్యాట్రిక్ ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించింది. ఈ సందర్భంగా తనను కలిసిన విజేతలను, అధికారులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. సిఐడి అడిషనల్ డిజిపి చారుసిన్హా ,కోచ్‌ లు డి. ప్రతాప్, ఎం. రామకృష్ణ , టీమ్ మేనేజర్ కె. ప్రసాద్ , వివిధ విభాగాల విజేతలు డిజిపిని కలిసిన వారిలో ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *