– మంత్రి ఉత్తమ్, రాహుల్ బొజ్జా లను కలిసిన సింగ్
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 3: రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమితులైన లెఫ్టినెంట్ జెనరల్ కల్నల్ హార్పల్ సింగ్ సోమవారం విధుల్లో చేరారు.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసేందుకు రూపొందించిన ఎస్ఎల్బిసి పనుల పునరుద్ధరణ నిమిత్తం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు లెఫ్టినెంట్ జనరల్ హార్పల్ సింగ్ మంత్రి ఉత్తమ్ కుమార్ తోపాటు నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్ లతో పాటు ఇఎన్సిలు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబులను మర్యాద పూర్వకంగా కలిశారు. సివిల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడైన హార్పల్ సింగ్ టన్నెల్ నిర్మాణ రంగంలో అపార అనుభవం గడించిన దృష్ట్యా ఆయనను ఈ శాఖలో నియమించిన విషయం విదితమే. ముఖ్యంగా మూడు లక్షల ఎకరాలకు సాగు నీటితోపాటు ఫ్లోరోసిస్ బారిన పడిన నల్లగొండ జిల్లా ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ఉద్దేశించ బడిన ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం తవ్వకంలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్ అనుభవాన్ని వినియోగించుకునేందుకు వీలుగా ఈ నియామకం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఎస్.ఎల్.బి.సి పనులు పూర్తి చేసి త్వరితగతిన పూర్తి చేయాలని నియమించిన నేపద్యంలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకీ తేనుంది. ఈ క్రమంలోనే సొరంగ మార్గం తవ్వకాలలో అపార అనుభవం గడించిన హార్పల్ సింగ్ సేవలు వినియోగించుకోనుంది.
——————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




