హరివంశ్‌ ‌నారాయణ సింగ్‌ ‌కు మరో ఛాన్స్

-‌ రాష్ట్రపతి కోటాలో నామినేట్‌ ‌చేసిన కేంద్రం
– మరోమారు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ అయ్యే అవకాశం

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 10: ‌రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ ‌నారాయణ్‌ ‌సింగ్‌  ‌కొనసాగే అవకాశముంది. అనుభవజ్ఞుడైన నాయకుడిగా, నిష్పక్షపాతంగా సభను నడిపించే సమర్థత కలిగిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. భారత పార్లమెంట్‌ ఎగువసభలో అత్యంత హుందాతనం గల నేతగా పేరుగాంచిన హరివంశ్‌ మరోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగబోతున్నారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ ‌గొగోయ్‌ ‌పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను నామినేట్‌ ‌చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 80 ‌ప్రకారం.. సాహిత్యం, శాస్త్రం, కళలు, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ ‌చేస్తారు. హరివంశ్‌ ‌తనకున్న సుదీర్ఘ జర్నలిజం అనుభవం, సామాజిక స్ప•హతో ఈ కోటాలో ఎంపికయ్యారు. బిహార్‌ ‌నుంచి జేడీయూ తరఫున ఎన్నికైన ఆయన సభ్యత్వ కాలం ఏప్రిల్‌ 9‌వ తేదీన ముగిసింది. సాధారణంగా పార్టీ కోటాలో సభ్యత్వం ముగిసిన తర్వాత తిరిగి పార్టీ టికెట్‌పైనే వస్తుంటారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్రపతి కోటా ద్వారా నేరుగా సభకు పంపడం గమనార్హం. రాజ్యసభ 13వ డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన పనిచేసిన తీరు అమోఘం. క్లిష్టమైన బిల్లుల చర్చ సమయంలో సభలో గందరగోళం నెలకొన్నప్పుడు, ఆయన చూపిన ప్రతిభ, నిష్పక్షపాత నిర్ణయాలు అధికార, ప్రతిపక్షాల మన్ననలు పొందాయి. హరివంశ్‌ ‌నారాయణ్‌ ‌సింగ్‌ను మళ్లీ సభకు పంపడం వెనుక కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక వ్యూహాలను రచించిన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎగువ సభలో ప్రతిపక్షాల బలం గణనీయంగా ఉన్నప్పుడు, సభను సమర్థవంతంగా నడపగలిగే వ్యక్తుల అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. హరివంశ్‌ ఆ ‌విషయంలో ఇప్పటికే తన సత్తా చాటారు. తాజా నామినేషన్‌తో ఆయన మళ్లీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశముంది. నామినేటెడ్‌ ‌సభ్యుడిగా ఉంటూ ఈ బాధ్యతలు చేపడితే అది సభకు మరింత గౌరవాన్ని తెస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్‌ ‌జర్నలిస్టుగా హరివంశ్‌కున్న విలువలు, రాజకీయాలకు అతీతంగా ఆయనకు ఉన్న ఆదరణ ప్రభుత్వానికి సానుకూల అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో హుందాతనం తగ్గుతున్న కాలంలో, హరివంశ్‌ ‌నారాయణ్‌ ‌సింగ్‌ ‌వంటి సీనియర్ల సేవలను వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని తెలిపారు.  ఓ అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్‌ ‌రావడం సభ గౌరవాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. హరివంశ్‌ ‌నారాయణ్‌ ‌సింగ్‌ ‌మళ్లీ డిప్యూటీ చైర్మన్‌ ‌బాధ్యతలు చేపడితే సభలో చర్చల నాణ్యత మరింత మెరుగుపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *