ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో హరీష్‌ ‌రావుకు ఊరట

– ప్రభుత్వ పటిషన్‌ ‌కొట్టివేసిన ‘సుప్రీమ్‌’ ‌ధర్మాసనం

న్యూదిల్లీ, జనవరి5 (ఆర్ఎన్ఏ): ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ‌నేత, మాజీ మంత్రి హరీష్‌ ‌రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర‌ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్పీని సుప్రీం ధర్మాసనం డిస్మిస్‌ ‌చేసింది. హరీష్‌ ‌రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో సర్కార్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్‌ ‌న్యాయవాది సిద్దార్థ్ ‌లూథ్రా వాదనలు వినిపించారు. అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్‌ ‌చేయించారంటూ మాజీ మంత్రి హరీష్‌ ‌రావుపై రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారి చక్రధర్‌ ‌గౌడ్‌ ‌పంజాగుట్ట పోలీస్‌ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ ‌కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్‌ ‌చేస్తూ హరీష్‌ ‌రావు హైకోర్టును ఆశ్రయించగా సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్‌ ‌చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసింది. దీనిపై సోమవారం విచారణ జరగగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని జస్టిస్‌ ‌బీవీ నాగరత్న ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎస్‌ఎల్పీలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. రాధాకిషన్‌రావు, హరీష్‌ ‌రావులకు వ్యతిరేకంగా ప్రభుత్వం వేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ వ్యవహారంలో గతంలో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినట్లు జస్టిస్‌ ‌బీవీ నాగరత్న ధర్మాసనం గుర్తుచేసింది. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో హరీశ్‌రావు, రాధాకిషన్‌ ‌రావు ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌చేశారని సిద్దిపేటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారి చక్రధర్‌ ‌గౌడ్‌ 2024‌లో పంజాగుట్ట పోలీస్‌ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే ఈ ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ ‌చేయాలని హరీష్‌ ‌రావు అదే ఏడాది డిసెంబర్‌ 4‌న హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆ ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ ‌చేస్తూ గత ఏడాది మార్చి 20న ఆదేశాలిచ్చింది. చక్రధర్‌ ‌గౌడ్‌ ‌ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ జూన్‌ 18‌న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

—————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *