సావు భాష తప్ప సాగుపై సోయి లేదు

–  ప్యా లెస్‌లో మీరుంటే.. రైతులు చలిలో ఉండాలా?
– రైతుల బతుకులు క్యూ లైన్లలోనే తెల్లారుతున్నాయి
– మీ యూరియా యాప్ ఏమైంది?
– ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభం లోనే రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యం వల్లే అన్నదాతల పరిస్థితి దారుణం గా తయారైందని ఆయన మండిపడ్డారు. “అందరినీ తొక్కుకుంటూ వచ్చాను” అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, తన చెత్త పాలనతో ఇప్పుడు రైతులను తొక్కుతున్నారని హరీశ్రావు విమర్శించారు. సావు భాష మా ట్లాడటం తప్ప సాగు గురించి అవగాహన లే ని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే రైతుల బతుకులు క్యూ లైన్లలో తెల్లారుతున్నాయని ధ్వజమెత్తారు. “నీ చిల్లర రాజకీయాలకు, నీ వి ధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతే” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సమ యానికి యూరియా కూడా అందించలేని వ్య క్తి ముఖ్యమంత్రిగా ఉండటం అవసరమా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. “మీరు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో హాయిగా కూర్చుంటే.. రైతు లు మాత్రం తెల్లవారుజాము నుంచి ఎముక లు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకుని యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్ గారూ.. మీరు చెప్పిన ‘మార్పు’ ఇదే నా?” అని నిలదీశారు. గత సీజన్లో ఎదురైన సమస్యల నుంచి ప్రభుత్వం ఏమాత్రం పాఠా లు నేర్చుకోలేదని హరీశ్రావు ఆరోపించారు. యూరియా కొరతను కప్పిపుచ్చడానికి తీసు కొచ్చిన ‘యూరియా యాప్’ ఏమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రవు ప్ర శ్నించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *