సింగరేణి బోనస్‌ను బోగస్‌ చేసిన రేవంత్‌

– కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50శాతం పైగా కోత
– ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దసరా పండుగ పూట సింగరేణి కార్మికులకు చేదు కబురు చెప్పారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌పై బీఆసనబ్ణన ఎమ్మెల్యే హరీష్‌రావు ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలో అయినా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ చేసింది ద్రోహమేనని విమరిÊశంచారు. నమ్మి ఓటేసినందుకు సింగరేణి కార్మికులను నయ వంచన చేసిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పాలనలో సింగరేణి కార్మికుల సంక్షేమం.. కాంగ్రెస్‌ పాలనలో ఘోరమైన సంక్షోభం అని వ్యాఖ్యానించారు. నికర లాభాల్లో 34శాతాన్ని కార్మికులకు బోనస్‌గా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ పక్షాన డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందన్నారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులను తీవ్ర నిరాశలో ముంచారన్నారు. మొత్తం లాభం రూ.6,394 కోట్ల నుండి కాక నికర లాభం రూ.2,360 కోట్ల నుండి బోనస్‌ చెల్లించడం దారుణమన్నారు. పంచాల్సిన వాటాను తగ్గించి శాతాలు పెంచి సింగరేణి కార్మికులను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కూడా ఇదేవిధంగా మోసం చేసి బోనస్‌లో 50శాతం వాటా కోత విధించారని, మొత్తంగా సంస్థ గడిరచిన లాభాల ఆధారంగా ప్రతి ఏడాది కార్మికులకు ఇచ్చే బోనస్‌ను కూడా బోగస్‌ చేశారని విమరిÊశంచారు. లాభాల వాటలో 50శాతం కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ఎంతో శ్రమించి సంస్థకు మంచి లాభాలు చూపినందుకు డబుల్‌ వాటా వస్తుందన్న కార్మికుల ఆశలను అడియాసలు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. గతంలో కేసీఆర్‌ సర్కారు మాదిరి కాకుండా కాంగ్రెస్‌ వచ్చిన లాభాన్ని మూడో వంతు పక్కన పెట్టి మిగిలిన ఒక వంతులో వాటా ఇవ్వడం దుర్మార్గమన్నారు. గతేడాది సింగరేణి భవిష్యత్‌ ప్రణాళిక కోసమని పక్కనపెట్టిన రూ.2,283 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఇప్పుడు రూ.4,034 కోట్ల సింగరేణి సొమ్ముకు ఎసరు పెట్టారని, కార్మికులకు హక్కుగా రావాల్సిన వాటా ఎవరి జేబులకు మళ్లిస్తున్నట్లు అని నిలదీశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతోందని, నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కేసీఆర్‌ లాభాల బాట పట్టించారని హరీష్‌రావు చెప్పారు. కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ వచ్చారన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ఎంతో ఉదారతతో వ్యవహరించారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే రేవంతన ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదని విమరిÊశంచారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏటా చెల్లించినట్లుగానే లాభాల్లో వాటా చెల్లించాలని, నికర లాభంలో 34% బోనస్‌గా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ పక్షాన ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ అన్యాయాన్ని తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *