కాళేశ్వరంపై హరీష్‌ మరోమారు పిటిషన్‌

– పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు భయమెందుకని ప్రశ్న

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30 : కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలన్నారు. ఈ పిటిషన్‌ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను కొట్టివేయాలని గతంలోనూ కేసీఆర్‌, హరీష్‌రావులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ల ఆధారంగా గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు నోటీసులు జారీ చేసి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై అక్టోబరులో తదుపరి విచారణ చేపట్టనుంది. తప్పులు చేశారో.. లేదో తేల్చాల్సింది మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ కాదని హరీష్‌రావు అన్నారు. అది తేల్చాల్సింది కోర్టులు, ప్రజలు అని పేర్కొన్నారు. కాళేశ్వరంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వట్లేదంటే అధికార పక్షం భయపడుతున్నట్లే అని పేర్కొన్నారు. వాస్తవాలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు మాటలు చూస్తుంటే ఆయనకు వాస్తవాన్ని అంగీకరించడం ఇష్టం లేదని తెలుస్తోందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *