బనకచర్లపై చర్చ జరగలేదని అంటారా ?

-మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై16:  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో మొదటి అంశమే బనకచర్ల అని భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. కానీ.. బనకచర్ల ప్రస్తావనే రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని.. ఆయన మాటలు, చేతలకు పొంతన ఉండదని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మిడియా సమావేశంలో హరీష్‌ ‌రావు మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు, ఇతర అంశాల పరిష్కారానికే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారని హరీష్‌  ‌చెప్పారు. రాష్ట్రంలో భాజపా, తెదేపా రిమోట్‌ ‌పాలన కొనసాగుతోంది. కమిటీ నిర్ణయాన్ని అంగీకరిస్తామని సీఎం రేవంత్‌ ‌చెప్పడం సబబు కాదన్నారు. బనకచర్లపై కేంద్రం భేటీయే తప్పు.. సీఎం పాల్గొనడం మరో తప్పు. కేంద్ర సంస్థలు తిరస్కరించిన ప్రతిపాదనపై సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తూ సీఎం మరణశాసనం రాశారు. బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *