ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపణలు అవాస్తవం

– రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తమ కంపెనీ కార్యకలాపాలపై ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన ఆరోపణలను తాము ఖండిస్తున్నామని రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ తెలిపింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇప్పటివరకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ నుండి ఎలాంటి నోటీసులు తమ కార్యాలయానికి గానీ, తమ అధీకృత ప్రతినిధులకు గానీ అందలేదు. ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మాత్రమే తమకు తెలిసింది. తమ రాఘవ కంపెనీ కోత్వాల్‌గూడ గ్రామంలో ఎప్పుడూ స్వయంగా ఎలాంటి క్రషర్‌ను ఏర్పాటు చేయలేదు లేదా నిర్వహించలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తిరుమల మెటల్ ఇండస్ట్రీ సంస్థ 12.11.2024 ఒప్పందం ప్రకారం రాఘవ కన్స్ట్రక్షన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన క్రషర్‌ను లీజ్ పద్ధతిలో తీసుకుని తమ క్రషింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. విద్యుత్ కనెక్షన్ నం.115228152) తిరుమల మెటల్ ఇండస్ట్రీ యజమాని పి.మల్లికార్జున కుమార్ పేరుమీద, నాన్-డొమెస్టిక్ వినియోగం కోసం పొందారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, హెచఆర్‌డీటీఐఎల్ వారు 27.09.2024 ఒప్పందం ప్రకారం అప్పగించిన రహదారి పనుల కోసం అవసరమైన క్రష్డ్ స్టోన్ అగ్రిగేట్స్‌ను తిరుమల మెటల్ ఇండస్ట్రీ నుండి కొనుగోలు చేస్తోంది. హెచఆర్‌డీటీఐఎల్ వారు 8.01.2025 లేఖ ద్వారా రంగారెడ్డి జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్‌కి ఈ విషయాన్ని తెలియజేసి అవసరమైన సీనరేజ్ చార్జీలను తాము మినహాయించి సంబంధిత శాఖకు చెల్లిస్తామని స్పష్టంగా పేర్కొని, రాఘవ కన్స్ట్రక్షన్స్ రోడ్ మెటీరియల్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు అనుగుణంగా హెచఆర్‌డీటీఐఎల్ వారు రాఘవ కన్స్ట్రక్షన్స్ నిర్వహించిన పనుల పరిమాణాన్ని అంచనా వేసి రూ.2,75,23,271 మొత్తాన్ని కట్ చేసి 8-12-2025న మైన్స్ అండ్ జియాలజీ శాఖకు జమ చేశారు. ఎమ్మెల్యే హరీష్‌రావు లక్షల రూపాయల చెల్లింపుల కోసం నోటీసులు జారీ చేశారని పేర్కొనగా కంపెనీ ఇప్పటికే రూ.2.75 కోట్లు చెల్లించిందన్నారు. క్రషర్ వద్ద ఉన్న స్టాక్‌కు సంబంధించిన సీనరేజ్ ఫీజు చెల్లింపు బాధ్యత రాఘవ కన్స్ట్రక్షన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు లేదని, కారణం వారు క్రషింగ్ కార్యకలాపాలు నిర్వహించడం లేదని తెలిపారు. హెచఆర్‌డీటీఐఎల్ అంచనా ప్రకారం తమ పనులకు ఉపయోగించిన మెటీరియల్‌కే వారు బాధ్యత వహిస్తారు, దానికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే మైన్స్ అండ్ జియాలజీ శాఖకు చెల్లించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పాత్ర హెచఆర్‌డీటీఐఎల్ ఒప్పందం ప్రకారం పనులు నిర్వహించడానికే పరిమితం. ఇంకా కాలుష్య నియంత్రణ మండలికి మైన్స్ శాఖ లేఖలు రాసిందని ఎమ్మెల్యే పేర్కొన్నప్పటికీ ఆ ప్రదేశంలో జరుగుతున్న మైనింగ్/క్రషింగ్ కార్యకలాపాలతో రాఘవ కన్స్ట్రక్షన్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. పై వాస్తవాలను పరిశీలించకుండా అలాగే సంబంధిత వ్యక్తులకు నోటీసులు సరైన విధంగా అందించకుం& మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకున్న చర్యలు అనవసరమైనవి. ముఖ్యంగా హెచఆర్‌డీటీఐఎల్ నుండి సరైన సమాచారం (8.01.2025), చెల్లింపు (8.12.2025) అందిన తరువాత కూడా ఈ చర్యలు తీసుకోవడం తగదు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత నోటీసులు తప్పుదారి పట్టించే సమాచారాన్ని సృష్టించి తమ ప్రతిష్టకు నష్టం కలిగించాయి పై విషయాలను ఇప్పటికే అందుకున్న సీనరేజ్ చెల్లింపుల విషయాన్ని గుర్తు చేసి, జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని సంబంధిత అధికారులను కోరాము. కంపెనీ డైరెక్టర్లుగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి-మేనేజింగ్ డైరెక్టర్, డి.నిరంజన్ రెడ్డి- డైరెక్టర్ వ్యవహరిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *