హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 30: బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్నిఘనంగా జరిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అవకాశాన్ని కల్పించామ‌ని ఆల‌య పీఆర్‌వో ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉదయం 5:15 గంటలకు వైకుంఠ ద్వార ప్రతిష్ఠా కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉత్తర ద్వారం(వైకుంఠ ద్వారం) గుండా భక్తులను దర్శనానికి అనుమతించారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని ముందుగా విశ్వగురు శ్రీల ప్రభుపాదులకు అందించారు. అనంతరం స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ రాధాగోవిందుల దివ్య దర్శనం భక్తులను పరవశింపజేసింది. ఆదిదేవుడు ప్రత్యేకంగా లక్ష్మినారాయణ అలంకరణలో అలరించారు. ఈ రోజు ప్రధాన ఆకర్షణగా, ఉత్తర ద్వారం వద్ద భక్తులను ఆహ్వానిస్తున్నట్లుగా “శ్రీ శ్రీనివాస గోవింద” స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణమంతా హరినామ సంకీర్తన, భజనలు, భక్తి గీతాలతో నిండి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా హరేకృష్ణ మూవ్‌మెంట్–హైదరాబాద్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ (ఎం.టెక్, ఐఐటి మద్రాస్) భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.  సాయంత్రం  శ్రీ రాధా గోవిందులు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఘనమైన మహా ఆరతి మరియు శయన ఆరతి ఇవ్వడంతో ఉత్సవాలు ముగిశాయి. రోజంతా భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ యాజమాన్యం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో హృదయపూర్వకంగా పాల్గొని, శ్రీ రాధా గోవిందా మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య ఆశీస్సులు పొందారు .


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *